మాలీవుడ్ ఇండస్ట్రీలో అంజూ జోసెఫ్‌ చాలా పాపులర్ సింగర్. ఈ కేరళ కుట్టి గాయని మాత్రమే కాదు చాలా అందంగా కూడా ఉంటుంది హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోని అందం ఆమె సొంతం. ఈ బ్యూటిఫుల్ సింగర్ తన ప్రతిభను ఒక్క అవకాశంలో చూపించింది. 2010లో, ఆమె ఐడియా స్టార్ సింగర్ మ్యూజిక్ కాంపిటీషన్ ప్రోగ్రామ్‌ ఫోర్త్ సీజన్‌లో పాల్గొంది. ఆమె పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఈ గాన కోకిల సినిమాల్లో పాటలు పాడడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే ఇతరుల పాటలను అనుకరించి పాడటం, స్టేజ్ షోలు చేయడం వంటివి చేయడం మొదలుపెట్టింది.

అంజూ జోసెఫ్‌ అనే గాయని "బాహుబలి" సినిమాలోని " ధీవర" అనే పాటకు కవర్ సాంగ్ చేసి తెలుగు వారికి కూడా బాగా దగ్గర అయింది. ఆమె పాట అందరికీ బాగా నచ్చింది. ఆమె ఒక షో డైరెక్టర్ అయిన అనుప్ జాన్‌ని పెళ్లాడింది. కానీ, వాళ్ళ పెళ్లి జీవితం ఐదు సంవత్సరాలు మాత్రమే సాగింది. ఆ తర్వాత వీళ్లు విడాకులు తీసుకున్నారు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో అంజూ జోసెఫ్‌ తన మనసులోని బాధల గురించి చెప్పింది. తనకు అబ్సెసివ్-కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ (OCPD) అనే ఒక మానసిన రోగం ఉందని చెప్పింది. ఆ రోగం వల్ల ఆమె ప్రతి పనినీ పర్ఫెక్ట్‌గా చేయాలని అనుకుంటుంది. అలాగే, ఆమెకు ఆందోళన కూడా ఎక్కువే. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ఆమె మందులు కూడా వాడుతుంది.

"నా గత సంబంధం వల్ల నాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందుల వల్ల నేను మందులు వాడాల్సి వచ్చింది. ఒకటిన్నర నెలలుగా నిద్ర పట్టడం లేదు. రాత్రంతా మెలకువగా ఉంటున్నా. ఏమీ ఆలోచించలేకపోతున్నా. నిద్ర పట్టకపోయినా, పరువు నుంచి లేవలేకపోతున్నా. అయినప్పటికీ, నేను షోలు చేస్తున్నా. నా బాధను ఎవరికీ తెలియనివ్వకుండా నవ్వుతూనే ఉన్నాను. ఎందుకంటే, ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉండాలని నేను కోరుకుంటాను. అది నా ప్రొఫెషన్, కాబట్టి నేను నా బాధను ఫేక్ నవ్వుతో దాస్తున్నాను" అని అంజూ మీడియాతో చెప్పింది.

"నా మనస్సుతో పాటు, నా శరీరం కూడా బాధపడుతోంది. షోలకు వచ్చే ప్రేక్షకులు నేను వచ్చే ముందే నేను ఏడ్చానని గమనిస్తున్నారు. నా భర్తతో విడిపోవడానికి కారణం నా OCD మాత్రమే కాదు, ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ, ఆ విడాకుల గురించి నేను బాధపడటం లేదు. బదులుగా, ఆ విడాకుల నుంచి చాలా పాఠాలు నేర్చుకుంటున్నాను. నేను ఎలాంటి వ్యక్తి అనేది నాకు ఇంకా బాగా అర్థమవుతోంది." అని ఆమె చెప్పుకొచ్చింది.

"నేను ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాను. ఏడుపు తప్ప నా దగ్గర మరేమీ మిగలలేదు. దీనికి చికిత్స కూడా తీసుకుంటున్నాను. నా జీవితం స్తంభించిపోయినట్లు అనిపిస్తుంది, కానీ నేను వదులుకోలేను. విడాకులు తీసుకోవడం అనేది క్రైమ్ కాదు, డివోర్స్‌ తీసుకున్న ప్రతి ఒక్కరూ చెడు వాళ్ళు కాదు అని నేను చెప్పాలనుకుంటున్నాను" అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: