సినిమా ఇండస్ట్రీలో హిట్ కి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. హిట్లు ఉన్న హీరోలకు ఆయన  దర్శకులకి అయిన , హీరోయిన్లకు అయినా అద్భుతమైన క్రేజ్ ఉంటుంది. వరుస హిట్లు ఉన్నా దర్శకులతో , హీరోలతో , హీరోయిన్లతో అయిన సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడుతూ ఉంటారు. అలాగే ఒక హిట్ సినిమా తీసిన దర్శకుడిని , ఒక హిట్ సినిమాలో నటించిన హీరోను , ఒక హిట్ సినిమాలో నటించిన హీరోయిన్ ని కాంబినేషన్ గా చేసి సినిమాలను రూపొందించడానికి కూడా నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఎందుకు అంటే హీరోకు , హీరోయిన్ కి , దర్శకుడికి ముగ్గురు కి మంచి హిట్లు ఉన్నట్లయితే అలాంటి కాంబినేషన్లో సినిమా చేస్తే సినిమా అనౌన్స్ అయినప్పటి నుండే దానిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఆ సినిమాకు మంచి బిజినెస్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సినిమాకు మంచి టాక్ కనుక వచ్చినట్లు అయితే అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానితో హిట్లలో ఉన్న కాంబినేషన్లకి మంచి క్రేజ్ ఉంటూ ఉంటుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం హరీష్ శంకర్ తన తదుపరి మూవీ ని రామ్ పోతినేని తో చేసే అవకాశం ఉన్నట్లు ప్రకటించాడు.

ఇకపోతే హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15 వ తేదీన విడుదల అయింది. రామ్ పోతినేని హీరోగా రూపొందిన డబల్ ఇస్మార్ట్ మూవీ కూడా అదే తేదీన విడుదల అయింది. ఒకే తేదీన విడుదల అయిన వీరిద్దరి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి. దాదాపు ఈ సినిమాలు అతి పెద్ద అపజయాన్ని అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఇలా భారీ అపజయాలతో ఉన్న వీరిద్దరి కాంబోలో సినిమా సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: