టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన సినిమా పరిశ్రమలో కెరియర్ను ప్రారంభించిన కొత్తలో చాలా సినిమాలకు కథ , మాటలు , స్క్రీన్ ప్లే ను అందించాడు. అలా కథ , స్క్రీన్ ప్లే , మాటలను అందించి ఈయన గొప్ప గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన దర్శకత్వం వైపు అడుగులు వేశాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.

ఇకపోతే త్రివిక్రమ్ తన కెరియర్లో చాలా మంది హీరోయిన్స్ ను రిపీట్ చేశాడు. అందులో భాగంగా ఆయన రిపీట్ చేసిన కొంత మంది హీరోయిన్లలో ఓ బ్యూటీ ఈయనకు ఎంతో లక్కీ. ఎందుకు అంటే ఆమెతో తీసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ఆమె సమంత. సమంత , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అత్తారింటికి దారేది సినిమాలో మొదటి సారి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో గా నటించాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అ ఆ" సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది. నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూడు సినిమాలలో సమంత హీరోయిన్గా నటించిగా ఈ మూడు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: