టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో అన్ని పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ.. పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్నారు. ఇటీవలే కల్కి 2898AD సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రభాస్,  ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి.  మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉండగా.. ఇందులో హీరోయిన్ గా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి అనే ఒక అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నారు.

ఈ విషయంపై సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. అసలు ఇండస్ట్రీ ముఖమే చూడని ఒక అమ్మాయిని ఇంత పెద్ద స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా పెట్టడం ఏంటి అంటూ అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. నిజానికి ఈమె కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు ఎక్స్ప్రెషన్ క్వీన్ కూడా.. అయినా సరే ఈమెను తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా దీనిపై దర్శకుడు హను రాఘవపూడి స్పందించారు. ఈమధ్య కాలంలో కొత్త టాలెంట్ ను  వెలికితీయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది దీనివల్ల చిత్ర బృందానికి తమ కథకు అనుగుణంగా నటీనటులను ఎంపిక చేసుకోవడం మరింత సులభంగా మారింది.

ఇమాన్వి అందం , ప్రతిభ కలిగిన అమ్మాయి. తాను కూడా డాన్స్ వీడియోలు చేస్తూ ఉంటుంది . ఆమె వీడియోలు అన్నిటిని నేను చూస్తాను. నా కథకు ఆమె పర్ఫెక్ట్ అనిపించింది. ముఖ్యంగా మంచి క్లాసికల్ డాన్సర్. కళ్ళతోనే హావభావాలు పలికిస్తుంది. దీంతో ఆమెకు అవకాశం ఇవ్వాలనిపించి ఇచ్చాను. అయితే ఆడిషన్స్,  స్క్రీన్ టెస్ట్ తర్వాతనే ఆమెను ఎంపిక చేసాము. ఇది తన ఒక్కడి నిర్ణయం మాత్రమే కాదు చిత్ర బృందం మొత్తం నిర్ణయం తీసుకుంది అంటూ తెలిపారు  హను రాఘవపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి: