నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్నఎన్బికె 109 చిత్రం ను దసరా కానుకగా విడుదల చేయాలని మొన్నటి వరకు భావించారు. కానీ బాలయ్య రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఇవ్వాల్సిన విధంగా డేట్లు ఇవ్వలేక పోయాడు. అందుకే షూటింగ్‌ కు చాలా ఆలస్యం అయ్యేలా ఉంది. అందుకే  ఎన్బికె  109 సినిమా విడుదల ఆలస్యం అయ్యేలా ఉందని ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు సినిమా టైటిల్‌ ను కూడా ఖరారు చేయలేదు కానీ, వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.టాలీవుడ్ అంటే సంక్రాంతికి.. ముఖ్యంగా స్టార్ హీరోలకు ఎంత ఇష్టమో వేరే చెప్పక్కర్లేదు. ఆ టైమ్ లో వచ్చే సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. యావరేజ్ మూవీస్ కూడా హిట్ అయిపోతుంటాయి. అదే బలమైన కంటెంట్ తో వస్తే బ్లాక్ బస్టర్స్ తో పాటు రికార్డులూ గ్యారెంటీ. అందుకే సంక్రాంతికి చాల రోజుల ముందుగానే కర్చీఫ్ లు వేస్తుంటారు మేకర్స్. ఇప్పటికే సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఉంది. దీంతో పాటు వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ రవితేజ సినిమాలు జనవరి సెకండ్ వీక్ లో రాబోతున్నాయి. అయితే ఈ పోటీలో ఇప్పుడు బాలయ్య కూడా బరిలోకి దిగుతున్నాడట.

బాలయ్య 109వసినిమాగా రూపొందుతోన్న మూవీని మొదట డిసెంబర్ బరిలో విడుదల చేయాలనుకుున్నారు. కానీ ఏమైందో సంక్రాంతికే ఫిక్స్ అవుతున్నారని టాక్. వాల్తేర్ వీరయ్య తర్వాత బాబీ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. కంప్లీట్ గా బాలయ్య మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఇప్పటి వరకూ వచ్చిన వీడియో కంటెంట్ చూస్తే మాగ్జిమం గ్యారెంటీ అనిపిస్తోంది. ఇక బాలయ్యతో పాటు ప్రగ్యా జైశ్వాల్, చాందిన చౌదరి, ఊర్వశి రౌతేలా ఫీమేల్ రోల్స్ చేస్తున్నారు. యానిమల్ ఫేమ్ బాబీడియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్బికె 109 వర్కింగ్ టైటిల్‌తో సినిమా షూట్ జరుగుతుంది. ఇక ఇప్పటికే సినిమా షూట్ చాలా బాగం పూర్తయినా.. రిలీజ్ డేట్, టైటిల్ మేకర్స్ అనౌన్స్ చేయలేదు.ఇకపోతే ప్రస్తుతం అందుతున్న వార్తలు ప్రకారం ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నారట. అందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన మరి కొద్ది రోజుల్లోనే రాబోతుందంటూ నెటింట వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాబి చివరగా తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య సినిమాను కూడా సంక్రాంతి పండుగలోనే రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇదే సెంటిమెంట్ ను ఇప్పుడు రిపీట్ చేయాలని ఉద్దేశంతో మూవీ టీం ఫిక్స్ అయ్యారట. ఇక ఎన్బికె 109 మూవీ సంక్రాంతి బరిలో రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో..? బాబి బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో..? లేదో..? వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: