మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టి, తన డ్యాన్సులతో థియేటర్లను దద్దరిల్లేలా చేసి, తన ఫైట్స్ తో విజిల్స్ వేయించి, సినిమా థియేటర్స్ లో జాతర వాతావరణాన్ని సృష్టించిన హీరో. కమర్షియల్ సినిమాలతో థియేటర్లకు ఊపు తెచ్చి, ఇండియన్ తెరపై బ్రేక్ డ్యాన్స్ లతో కుర్రకారును ఉర్రూతలూగించారు.

ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదే జోష్ తో వరుస సినిమాలు చేస్తున్నారు. నేడు ఆయన పుట్టిన రోజును ఫ్యాన్స్ భారీ ఎత్తున సెలెబ్రేట్ చేసుకున్నారు.ఇదిలా ఉంటె మెగాస్టార్ చిరంజీవి తన ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎక్కువ సినిమాలు ఎవరితో చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

చిరుతో ఎక్కువ సినిమాలు చేసిన డైరెక్టర్ ఏ . కోదండరామిరెడ్డి. 80వ దశకంలో వీళ్ల కాంబో ట్రెండ్ సెట్టర్ గ నిలిచింది. వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు దాదాపు బ్లాక్ బస్టర్స్ ‌గా నిలిచాయి. చిరంజీవి, ఏ.కోదండరామిరెడ్డి కలయికలో మొత్తం  23చిత్రాలు వచ్చాయి.

1.న్యాయం కావాలి -  సూపర్ హిట్‌
2.కిరాయి రౌడీలు - హిట్‌‌
3.ప్రేమ పిచ్చోళ్లు - ఫ్లాప్‌
4.అభిలాష -  బ్లాక్ బస్టర్
5.శివుడు శివుడు శివుడు  - డిజాస్టర్‌
6.ఖైదీ - ఇండస్ట్రీ హిట్
7.గూండా -  సూపర్ హిట్‌
8.ఛాలెంజ్ - సూపర్ హిట్‌
9.రుస్తుం -  యావరేజ్‌
10.దొంగ -  హిట్‌
11.రక్త సిందూరం -  ఫ్లాప్‌
12.విజేత - సూపర్ హిట్‌
13.కిరాతకుడు -  అట్టర్ ఫ్లాప్‌
14.వేట -  ఫ్లాప్‌
15.రాక్షసుడు - సూపర్ హిట్‌
16.దొంగ మొగుడు - బ్లాక్ బస్టర్
7.పసివాడి ప్రాణం - ఇండస్ట్రీ హిట్
18.జేబు దొంగ -  డిజాస్టర్‌
19.మరణ మృదంగం - యావరేజ్‌
20.త్రినేత్రుడు - ఫ్లాప్‌
21.అత్తకు యముడు అమ్మాయికి మొగుడు - ఇండస్ట్రీ హిట్‌
22.కొండవీటి దొంగ -  హిట్‌
23.ముఠా మేస్త్రీ -  సూపర్ హిట్‌


మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ సినిమా విశ్వంభర. బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. కొన్ని నెలలుగా మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం చాలారోజుల మెగా ఫ్యా్న్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: