నేడు మన తెలుగు సినిమా దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు హడావిడి ఈరోజు కంటే ముందే మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అభిమానుల కోసం చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర రీరిలీజ్ చేశారు. ఇంద్రసేనారెడ్డిగా చిరంజీవి మరోసారి సిల్వర్ స్క్రీన్ కి షేక్ చేయనున్నాడు.
 ఒక్క ఆన్ లైన్ లోనే కాకుండా ఆఫ్ లైన్లో కూడా మెగాస్టార్ పుట్టినరోజు కోసం అభిమానులు ఆల్రెడీ ఎన్నో స్టార్ట్ చేస్తుండగా ఈ స్పెషల్ డేన


 వచ్చే ట్రీట్స్ కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అయితే దర్శకుడు వశిష్ట తో చేస్తున్న మాసివ్ విజువల్ ట్రీట్ చిత్రం “విశ్వంభర” ట్రీట్ కోసమే అభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక చిరంజీవి బర్త్ డే నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిరంజీవి సమకాలీన నటుడు బాలకృష్ణకు ఆయన నటించిన ఓ చిత్రం అంటే మహా ఇష్టం అట. దర్శకుడు కే రాఘవేంద్రరావు-చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి బాలకృష్ణ ఆల్ టైం ఫేవరేట్ మూవీ అట. ఈ చిత్రాన్ని ఆయన బాగా ఎంజాయ్ చేస్తాడట. ఈ విషయాన్ని బాలకృష్ణ గతంలో ఓ

 ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు.  1990లో సోషియో ఫాంటసీ మూవీగా విడుదలైన జగదేకవీరుడు అతిలోక సుందరి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. మానవుడిని ప్రేమించే దేవకన్య కథగా ఈ చిత్రం తెరకెక్కింది. దేవకన్య పాత్రలో శ్రీదేవి అద్భుతం చేసింది. విశ్వంభర 2025 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. విశ్వంభర చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఎన్నో ఏళ్ళు తర్వాత మెగాస్టార్ మళ్లీ ఫాంటసీ జానర్ లో అదికూడా స్ట్రెయిట్ సినిమాతో వస్తుండడంతో మెగా అభిమానుల్లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: