రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది కల్కి2898 ఏడి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. తదుపరి ది రాజా సాబ్ చిత్రంలో కనిపించనున్నాడు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ది రాజా సాబ్ తో పాటుగా, ఫౌజి, కల్కి2, సలార్ 2, స్పిరిట్ వంటి భారీ చిత్రాలు చేస్తున్నాడు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తో సినిమాను కన్ఫర్మ్ చేసి, ఫ్యాన్స్ ను సంతోష పరిచాడు డార్లింగ్. వార్

 నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది. అందుకు కారణం దర్శకుడు హను రాఘవపూడి అని చెప్పాలి. సీతారామం చిత్రంతో ప్రేక్షకులని తన కథ, కథనంతో ఆకట్టుకున్నాడు. ఈ దర్శకుడు ప్రభాస్ చేస్తున్న చిత్రం కావడంతో ఇండస్ట్రీ అంతా సినిమా పై ఫోకస్ చేస్తోంది. బాహుబలి సినిమాతో తో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన స్టార్. ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బాహుబలి నుంచి ఇటీవల విడుదలైన కల్కి వరకు కలెక్షన్లు ప్రభాస్ స్టార్‌డమ్‌ని ప్రపంచానికి చాటిచెప్పాయి.

  సినిమాలు లు చేయడానికి ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడు. బాహుబలి సిరీస్ అతని నిబద్ధతకు ఉదాహరణ. బాహుబలి ఈ కోసం దాదాపు 1095 రోజులు (మూడేళ్లకు పైగా) పనిచేశాడు. ప్రభాస్ ఫిజికల్ ట్రైనింగ్, మాస్టర్ యాక్షన్ సీక్వెన్స్‌ల పట్ల ఆయనకున్న అంకితభావానికి నిదర్శనం. సినీ పరిశ్రమలో చాలా మందికి స్ఫూర్తినిచ్చింది.. మరోవైపు దర్శకుడు హను రాఘవపూడి  లోకేషన్స్ వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఛటర్జీ అదే విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. దర్శకుడు హను రాఘవపూడి తో లోకేషన్స్ రెక్కీ లో ఉన్నట్లు తెలిపాడు. హను రాఘవపూడి ఫోటోను ఒకటి షేర్ చేశాడు. ఇది వైరల్ గా మారుతోంది. .!!

మరింత సమాచారం తెలుసుకోండి: