సినిమా ఇండస్ట్రీలో కొంత మంది కథ రచయితలు కొంత మంది హీరోలను దృష్టిలో పెట్టుకొని స్టోరీలను రెడీ చేస్తూ ఉంటారు. ఆ స్టోరీలో వారు హీరోగా నటిస్తే ఎంతో బాగుంటుంది అని ఉద్దేశంతో స్టోరీని డెవలప్ చేస్తూ ఉంటారు. కానీ స్టోరీ మొత్తం పూర్తి అయిన తర్వాత వారికి వినిపించగా వారు రిజెక్ట్ చేయడంతో వేరే అవకాశం లేక వేరే వాళ్ళతో సినిమాలు చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భం ఒకటి అనిల్ రావిపూడి విషయంలో జరిగింది. అది ఏంటో తెలుసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కథ రచయిత మరియు దర్శకుడు అయినటువంటి అనిల్ రావిపూడి కొంత కాలం క్రితం రాజా ది గ్రేట్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రవితేజ హీరోగా నటించగా ... మెహరీన్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ లో మొదట రవితేజ ను కాకుండా అనిల్ రావిపూడి , రామ్ ను హీరోగా అనుకున్నాడట. అసలు రామ్  ను హీరోగా అనుకునే ఈ కథ మొత్తాన్ని తయారు చేశాడట.

కథ మొత్తం తయారు అయిన తర్వాత అనిల్ రావిపూడి ఈ స్టోరీని రామ్ కి వినిపించాడట. స్టోరీ మొత్తం విన్నా రామ్ కథ సూపర్ గా ఉంది. కాకపోతే నేను ఈ మధ్య కాలంలో వరుసగా కమర్షియల్ సినిమాలలో నటిస్తూ వస్తున్నాను. మళ్ళీ ఇలాంటి కమర్షియల్ సినిమా అంటే వర్కౌట్ కావడం కష్టం. మళ్లీ ఎప్పుడైనా సినిమా చేద్దాం అని అన్నాడట. దానితో రామ్ , రవితేజ ను సంప్రదించి కథను వివరించడం , ఆయనకు ఈ స్టోరీ అద్భుతంగా నచ్చడం , వెంటనే ఈ సినిమా ఓకే కావడం జరిగిందట. అలా రామ్ కోసం రాసుకున్న కథలో రవితేజ హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: