తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో అనుష్క శెట్టి ఒకరు. ఈమె టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ బ్యూటీ కి ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు దక్కాయి. దానితో ఈమె కూడా సూపర్ సినిమా తర్వాత చాలా కమర్షియల్ సినిమాలలో నటించి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో అనుష్క చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతుంది.

ఈ నటి ఆఖరుగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అనుష్క , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఘాటి సినిమాలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం అనుష్క కోడి రామకృష్ణ దర్శకత్వంలో అరుంధతి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో అనుష్క తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో అనుష్క క్రేజ్ ఒక్క సారిగా విపరీతంగా పెరిగిపోయింది.

ఇకపోతే ఈ సినిమాలో అనుష్క పాత్రకు బుల్లి తెర నటి శిల్ప డబ్బింగ్ చెప్పింది. ఈమె ఈ సినిమాలో అనుష్క పాత్రకు చెప్పిన డబ్బింగ్ అద్భుతంగా సెట్ అయింది. ఇకపోతే శిల్ప డబ్బింగ్ చెప్పడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలలో కూడా నటించింది. నటి శిల్ప అరుంధతి సినిమాలో అనుష్కకు మాత్రమే కాకుండా సౌందర్య , ఆమని వంటి మరి కొంత మంది హీరోయిన్స్ కు కూడా డబ్బింగ్ చెప్పింది. ఈమె మొదట దూరదర్శన్ లో సీరియల్స్ లో నటించేది. ఆ తర్వాత సినిమాలలో ఇతర భాష నటులకు డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: