తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ తాజాగా ఓ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. అంతే కాదు, పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ ఫ్లాగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ పార్టీ పేరు తమిళగ వెట్రి కజగం. జెండా మధ్యలో వికసించే పుష్పం, ఇరువైపులా రెండు ఏనుగులు ఉన్నాయి. పువ్వు, ఏనుగులు విజయానికి చిహ్నాలు, ఇది జెండా తెలియజేసే సందేశం. మెరూన్, పసుపు వంటి రెండు రంగులతో ఈ ఫ్లాగ్ కనిపిస్తోంది. నెటిజన్లు విజయ్ కొత్త పార్టీ జెండా కర్ణాటక రాష్ట్ర జెండా, స్పెయిన్ నేషనల్ ఫ్లాగ్ ను పోలి ఉన్నట్లు గమనించారు.  ఈ బలమైన పోలిక మరిన్ని చర్చలకు దారి తీస్తోంది.  పతాకావిష్కరణ కార్యక్రమంలో సామాజిక న్యాయం పథంలో నడుస్తానని విజయ్ ప్రకటించారు.

2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ జెండా ఆవిష్కరణ ఒక ముఖ్యమైన చర్య. విజ‌య్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌న పార్టీ పాత్ర‌ను నిర్వ‌హించేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో కలిసి ఎన్నికల్లో విజయం సాధించి ఘనవిజయం సాధించారు పవన్ కళ్యాణ్.  తమిళనాడులో విజయ్ ఇలాంటి సక్సెస్ సాధించగలడా?  ఈ ప్రశ్నకు సమాధానం 18 నెలల్లో తెలుస్తుంది.

విజయ్ పార్టీ ఫ్లాగ్ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ.. "మీరందరూ మా మొదటి రాష్ట్ర సదస్సు కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మీ అందరికీ గుడ్ న్యూస్ ఎందుకంటే దానికి సన్నాహాలు ఆల్రెడీ వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే నేను దాని గురించి తెలియజేస్తాను. దానికంటే ముందు, నేను ఈ రోజు మన పార్టీ జెండాను లాంచ్ చేశా, చాలా గర్వంగా ఫీలవుతున్నా. తమిళనాడు అభివృద్ధికి మనమందరం కలిసి పని చేద్దాం." అని చెప్పారు.

 విజయ్ మనసు చాలా మంచిది అని చాలామంది చెబుతుంటారు. సినిమాల్లో తలెత్తిన అనేక సమస్యలను తీర్చడానికి ఆయన అద్భుతమైన ఐడియాలను ప్రతిపాదించారు. ఈయనకు దాని గుణం కూడా ఎక్కువే. పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తమిళనాడులో విజయ్ కి కూడా అదే సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. మరి వారు ఇతన్ని గెలిపిస్తారో లేదో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: