యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ రేంజ్‌కు ఎదిగాడు. ఆస్కార్‌ అవార్డ్స్ ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు కూడా ఎన్టీఆర్ ను చాలా మంది గుర్తుపట్టారు. ఎన్టీఆర్ నటనకు దిగ్గజ హాలీవుడ్ దర్శకులకు కూడా ఫిదా అయ్యారు. ఇక ఈ నందమూరి కుర్రాడికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, తారక్ సినిమా కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ వెయిట్ చేసే వీరాభిమానులు అందరూ ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా హీరోగా అవతరించిన ఎన్టీఆర్ త్వరలోనే దేవర సినిమాతో ఆకట్టుకోనున్నాడు. ఈ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను అలరించే తారక్ సరసన ఒక్క అనుష్క శెట్టి తప్ప దాదాపు అందరూ స్టార్ హీరోయిన్లు నటించారు. కాజల్, సమంత, తమన్నా, ప్రియమణి, నిత్యామీనన్, నాతో ఎన్టీఆర్ కెమిస్ట్రీ స్క్రీన్ పై మంటలు పుట్టించిందని చెప్పుకోవచ్చు. సమంతతో ఈ నటుడు ఏకంగా మూడు సినిమాలు తీశాడు. అయితే ఆమెతో తీస్తే అది ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తారక్ సమంత కాంబోపై ఒక సెంటిమెంటు అనేది వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అందువల్ల ఆ హీరోయిన్ తో సినిమా చేస్తే ఫ్లాప్ రావడం ఖాయం అని కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ సినిమాలకు ఆ హీరోయిన్ అస్సలు అచ్చు రాలేదంటూ షాకింగ్ థియరీ చెబుతున్నారు.

స్టార్ బ్యూటీ సమంతకు టాలీవుడ్ లో యమ క్రేజ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ సినిమా చేస్తుందంటే రివ్యూలు కూడా చదవకుండా థియేటర్లకు వెళ్ళిపోయే ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం సమంత, ఎన్టీఆర్ తొలిసారిగా కలిసి బృందావనం సినిమాలో యాక్ట్ చేశారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో సమంతకు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని చాలామంది కామెంట్లు చేశారు. ఎన్టీఆర్, సమంత జోడుకి తిరుగు లేదని కూడా అన్నారు.

 ఇలాంటి హిట్ అందుకున్న కొన్ని వేలకు మళ్ళీ వీరి కాంబినేషన్‌లో ఒక సినిమా వచ్చింది. అదే "రామయ్య వస్తావయ్య" హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాపై అంచనాల ఎక్కువగానే ఉన్నాయి. అయితే స్టోరీ బాగోలేకపోవడం వల్ల ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో "రభస" వచ్చింది. ఈ మూవీ చాలా బాగుంటుందని ప్రేక్షకులు ముందు నుంచి అనుకుంటూ వచ్చారు కానీ స్టోరీ చెత్తగా ఉండడంతో ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ వచ్చింది. అలా తారక్, సమంత కాంబోలో వచ్చిన బృందావనం ఒక్కటే సక్సెస్ కాగా మిగతా రెండు సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ ను దెబ్బతీసేలాగా ఫ్లాప్ అయ్యాయి. అందువల్ల సమంత, ఎన్టీఆర్‌కు అస్సలు అచ్చు రాలేదంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: