రష్మిక మందన్న గీత గోవిందం, డియర్ కామ్రేడ్, భీష్మ సరిలేరు నీకెవ్వరు, పుష్ప, యానిమల్ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ ముద్దుగుమ్మ చాలా టాలెంటెడ్ యాక్ట్రెస్, మనందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ఈ తార లీడ్ చేసే లైఫ్ మనందరికీ చాలా రెలటబుల్ గా ఉంటుంది. అగ్ర హీరోయిన్‌గా ఎదిగినా సరే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలాంటి లైవ్ కోరుకుంటుందో అలాంటి లైఫ్ ని ఈ ముద్దుగుమ్మ ఏం చేస్తుంది.

ఈ అందాల తారకు తన అభిమానులతో తన జీవితంలోని కొన్ని క్షణాలను పంచుకోవడం చాలా ఇష్టం. 'పుష్ప' సినిమాలో డీ గ్లామర్ రోల్ చేసినా ఆమెకు అందరూ ఫిదా అయ్యారు. ఆమె శ్రీవల్లి క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది. రష్మిక తాను రోజూ ఏం చేస్తుందో ఇటీవల కొన్ని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసింది. అందులో ఆమె చాలా సరదాగా, అందంగా ఉంది.

రష్మిక తన డైరీలో చాలా సరదాగా తన రోజువారీ జీవితాన్ని రాసుకుంది. రుచికరమైన ఆహారం తినడం నుంచి తన కుక్క పిల్ల 'ఆరా'తో ఆడుకోవడం వరకు, పుస్తకాలు చదవడం, నిద్రపోవడం వరకు చాలా సరదాగా ఉంటుంది. ఈ ఫిట్‌నెస్ ఫ్రీక్ తనకు వ్యాయామం చేయడం చాలా ఇష్టమని కూడా చెప్పింది. అయితే, రుచికరమైన ఆహారాన్ని చూస్తే ఎక్కువగా తినకుండా ఆగలేకపోతున్నానని కూడా చెప్పి నవ్వించింది. చాలా మందికి ఇలాంటి సమస్య ఉంటుంది కదా!

"నా జీవితంలో ఇప్పుడు నేను లేకుండా ఉండలేని కొన్ని విషయాలు ఇవే... చాలామంది నన్ను నటిగా చూసినా, నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను ఎప్పుడూ ఇలానే చూస్తారు." అని ఈ ముద్దుగుమ్మ తన డైరీ పేజీలో రాసుకొచ్చింది. రష్మిక పెద్ద స్టార్ అయినప్పటికీ, చాలా సరదాగా, సాధారణంగా జీవితం గడుపుతుంది. ఆమె డైరీలో రాసినవి చదివితే, సెలబ్రిటీల గురించి వచ్చే వార్తల కన్నా చాలా బాగుంటాయి. వీటి ద్వారా మనకు రష్మిక అసలు ఎలాంటి వ్యక్తి అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: