టాలీవుడ్‌లో చిరంజీవి - విజయశాంతి జోడికి స్పెషల్ క్రేజ్ ఉంది. 80,90లలో వీరి జోడికి ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వీళ్ల కాంబోలో సినిమాలంటే అప్పటి ప్రేక్షకులకు పెద్ద పండగనే అని చెప్పాలి. వీరి కాంబోలో ఏకంగా 19 సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఇంతకీ ఆ 19 సినిమాలేంటి? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. చిరు - విజయశాంతి తొలిసారి ‘సంఘర్షణ’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.  

2.  రెండోసారి ‘దేవాంతకుడు’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది.
3. మహానగరంలో మాయగాడు : విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన  బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

4. ఛాలెంజ్:  ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది.

5. చిరంజీవి : తన సొంత పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

6. కొండవీటి రాజా - హిట్

7. ధైర్యవంతుడు - అట్టర్ ఫ్లాప్

8. చాణక్య శపథం -  డిజాస్టర్‌

9. పసివాడి ప్రాణం - ఏ . కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి - విజయశాంతి జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

10 .స్వయం కృషి - 1987లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ  సినిమా అద్భుత విజయాన్ని సాధించి టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ చిత్రంగా మిగిలిపోయింది.

11. మంచి దొంగ - యావరేజ్‌

12. యముడికి మొగుడు - రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో  చిరంజీవి - విజయశాంతి జోడిగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

13. యుద్ధ భూమి - యావరేజ్

14. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు - - ఏ . కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద  ఇండస్ట్రీ  హిట్ గా నిలిచింది.

15 . రుద్రనేత్ర - హిట్

16 - కొండవీటి దొంగ - హిట్

17. స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ - ప్లాప్

18. గ్యాంగ్ లీడర్ - విజయ బాపినీడు తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద  ఇండస్ట్రీ  హిట్ గా నిలిచింది.

19. మెకానిక్ అల్లుడు - చిరంజీవి,విజయశాంతి జోడిగా నటించిన చివరి సినిమా ‘మెకానిక్ అల్లుడు’. బి.గోపాల్ దర్శకత్వంలో అల్లు అరవింద్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌ను మూటకట్టుకుంద

మరింత సమాచారం తెలుసుకోండి: