గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’ సాంగ్‌, వస్తోన్న అప్డేట్లతో గేమ్ ఛేంజ‌ర్‌పై మరింత హైప్ ఏర్పడింది.క్రిస్మ‌స్ సంద‌ర్భంగా భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు.ఈ ఏడాది క్రిస్మ‌స్ కి గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం అని చెప్ప‌డ‌మే కాదు, ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో పండ‌గ వాతావ‌ర‌ణాన్ని తీసుకొస్తున్నారు నిర్మాత‌లు.ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు రీసెంట్ గా ఈ సినిమా గురించి స్పందిస్తూ ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలియజేసారు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని దసరా రోజు రిలీజ్ చేయాలనే ఆలోచనలు సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ట్రైలర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా కట్ చేయాలని శంకర్ అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడని కూడా దిల్ రాజు తెలియజేయడం విశేషము… ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అంటూ చాలా అంచనాలైతే పెంచుతున్నారు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ రేంజ్ లో ఉంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.మరి వీటన్నింటికీ శంకర్ చెక్ పెడుతూ శంకర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ సక్సెస్ ని సాధిస్తే పాన్ ఇండియాలో మరోసారి స్టార్ హీరోగా వెలుగు పొందుతాడు… లేకపోతే మాత్రం మరోసారి ఆయన క్రేజ్ భారీగా పడిపోతుందనే చెప్పాలి. తన మార్కెట్ ని తన స్టార్ డమ్ ను విస్తరించుకోవాలంటే మాత్రం ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకమనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: