ప్రముఖ హాలీవుడ్ అనిమేటెడ్ సినిమా ‘ముఫాసా. 'ది లయన్ కింగ్’ కోసం తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారనే వార్త తెలుగు సినీ ప్రేమికులను ఉత్సాహంగా నింపింది. ఈ సినిమాలో ముఫాసా అనే గొప్ప సింహం పాత్రకు మహేష్ బాబు తన గొంతును అందించడం విశేషం. కాగా ఈ సినిమాకు హిందీలో షారుఖ్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఇండియాలోనూ మంచి క్రేజ్ నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఈగరుగా వెయిట్ చేస్తున్నారు దీంతో ఈ ‘ముఫాసా’ చిత్రాన్ని పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కాగా ఇప్పుడు తెలుగులో ‘ముఫాసా’ కోసం సూపర్ స్టార్

 మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. దీంతో అభిమానులు అంతా ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యారు. మహేష్ లాంటి స్టార్ యాక్టర్ వాయిస్ ఓవర్ ఇస్తుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లోనూ అంచనాలు ఏర్పడుతున్నాయి. మహేష్ బాబు ఇప్పటికే అనేక సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ, ఇలాంటి ఓ ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఇదే మొదటిసారి. ముఫాసా పాత్ర యొక్క గంభీరత, బలం , నాయకత్వ లక్షణాలు మహేష్ బాబు వాయిస్‌కు ఎంతో సరిపోతాయని అభిమానులు భావిస్తున్నారు. మహేష్ బాబు తన

 ప్రత్యేకమైన స్వరంతో ముఫాసా పాత్రకు మరింత బలం చేకూర్చనున్నారని ఆశిస్తున్నారు.  తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తెలుగు సినీ ప్రేమికులను ఉత్సాహంగా నింపింది. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇక ‘ముఫాసా’ తెలుగు ట్రైలర్‌ను ఆగస్టు 26న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని డిసెంబర్ 20న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: