తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను  వేసుకున్నాడు నాచురల్ స్టార్ నాని.  ఇక ఇప్పుడు ఈయన తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తి చేసుకొని ఆగస్టు 29న భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది కాసేపు పక్కన పెడితే తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని తెలుగు మీడియా తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ కార్యక్రమంలో పలు

 ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అయితే అందులో భాగంగా ఒక విలేఖరి, హార్రర్ జోనర్ మూవీ గురించి నానిని అడగగా దానికి  నాని క్లారిటీ ఇచ్చాడు. హార్రర్ జోనర్ లో సినిమా చేయను అని. ఇది గ్యారెంటీ అంటూ చెప్పుకొచ్చాడు. నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే నాని తన కెరీర్ ప్రారంభం నుండి కామెడీ, రొమాంటిక్ పాత్రలకు ప్రేక్షకులను బాగా అలరించారు. ఆయన ప్రేక్షకులు తనను ఈ రకమైన పాత్రల్లోనే ఎక్కువగా ఇష్టపడతారని భావిస్తున్నారు. అందుకే హార్రర్ జోనర్ కంటే కామెడీ,

 రొమాంటిక్ పాత్రలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు అని చెప్పవచ్చు. నాని తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాని తన కెరీర్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి సినిమా ఎంచుకునేటప్పుడు కథ, పాత్ర, దర్శకుడు వంటి అంశాలను బాగా పరిశీలిస్తారు. తన ప్రేక్షకుల అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమాలు ఎంచుకుంటారు. ఇక నాని తన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. ఆయన ప్రతి సినిమాలో  కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటారు. హార్రర్ సినిమాలు చేయకపోయినా కూడా ఆయన తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను ఎల్లప్పుడూ అలరిస్తూనే ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: