తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి ఫిదా సినిమా ద్వారా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే ఆడియన్స్ మనసు దోచుకున్న ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కుటుంబ బాధ్యతలు చేపట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉండగా తన ఈడు వారందరూ వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంటే సాయి పల్లవి మాత్రం ఇంకా వివాహానికి దూరంగానే ఉంది. అందుకే సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు అంటూ అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి పెళ్లి గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుంది.

పాత్రలకు ప్రాముఖ్యత ఉంటేనే చేస్తుంది. దీనికి తోడు రికమండేషన్ ఉన్నా , హీరో నామినేషన్ ఉన్న సినిమాలు చేయదు. అందుకే స్టార్ హీరోలు,  సూపర్ స్టార్లతో అవకాశం వచ్చినా, కథ నచ్చకపోతే సినిమాలు రిజెక్ట్ చేసేస్తుంది సాయి పల్లవి. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎక్స్పోజింగ్ చేయని హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. అద్భుతమైన కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ కెరియర్లో దూసుకుపోతున్న ఈమె,  ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం సినిమాలో చేస్తోంది. ఇందులో సీతగా కనిపించబోతోంది సాయి పల్లవి.  సీత పాత్ర అయితే చేస్తోంది కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అంటూ అడుగుతున్నారు.  ముఖ్యంగా సాయిపల్లవిని పెళ్లి చేసుకోమని ఒకరు టార్చర్ చేశారట. ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించిన విషయాలను కూడా బయటపెట్టింది.

సాయి పల్లవి మాట్లాడుతూ.. పెళ్లి విషయంలో మా తల్లిదండ్రులు నన్ను బాగా టార్చర్ చేశారు
 కజిన్ సిస్టర్స్ అందరికీ పెళ్లయిపోవడం ,, నేను ఇంకా పెళ్లి కాకుండా కరోనా నుంచి ఇంట్లో ఉండడంతో అప్పటినుంచి నాకు పెళ్లి టార్చర్ మొదలయ్యింది. నా కెరియర్ లో నేను అనుకున్నది ఇంకా ఏం సాధించలేదు ఇప్పుడే ఎలా పెళ్లి చేసుకుంటాను అని తల్లిదండ్రులతో చెప్పిందట. తల్లిదండ్రుల టార్చర్ భరించలేక కరోనా లాక్ డౌన్ ఎప్పుడు అయిపోతుంది.. తిరిగి సినిమాలలోకి ఎప్పుడు వెళ్తాను అంటూ తెగ మదన పడిపోయిందట సాయి పల్లవి.

మరింత సమాచారం తెలుసుకోండి: