'మిస్టర్ బచ్చన్' మూవీ రూ.70 కోట్ల బడ్జెట్లో తెరకెక్కింది. అయితే వారం రోజుల్లో ఈ సినిమా కేవలం 7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సాధారణంగా ఫస్ట్ వీక్ లోనే పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చుకోగలగాలి. ఫస్ట్ వీక్ లోనే ఇలాంటి రెస్పాన్స్ ఉంటే నెక్స్ట్ వీక్ ఎవరూ చూడరు. దీనివల్ల కోటి రావడమే గగనం. ఆ లెక్కన చూసుకుంటే మిస్టర్ బచ్చన్ థియేటర్ రన్ పూర్తయినట్లే అని చెప్పుకోవచ్చు. బ్రేక్ ఈవెన్ మాట అటు ఉంచితే కనీసం పుట్టిన పెట్టుబడిలో 15% కూడా వెనక్కి రాలేదు.

వాస్తవానికి ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి యువతను ఆకట్టుకుంటూ వచ్చింది. ప్రమోషనల్ కంటెంట్‌, పాటలను అన్నీ 'మిస్టర్ బచ్చన్' మూవీపై హైప్స్ పెంచేసాయి. కానీ రవితేజ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచి అందరికీ షాక్ ఇచ్చింది. 'మిస్టర్ బచ్చన్' మూవీ థియేట్రికల్ హక్కులు రూ.35 కోట్లకు అమ్ముడుపోయాయి. ఆ హక్కులను కొనుక్కున్న వారు 28 కోట్లు నష్టపోయినట్లే. మరి ఇంత తక్కువ కలెక్షన్స్ రావడానికి ఓ తప్పు కూడా ఉంది. అదేంటంటే 'మిస్టర్ బచ్చన్' మూవీని రిలీజ్‌కి ఒక్క రోజు ముందే ప్రీమియర్స్ షోలు వేశారు. సాధారణంగా ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి సినిమా ఎలా ఉందో అని చూడ్డానికి చాలా మంది వస్తారు.

అయితే ప్రీమియర్స్‌ వేయడం వల్ల, సినిమా రిలీజ్ కి ముందే ఈ మూవీ ఎలా ఉందనేది చాలామంది ప్రేక్షకులు తెలుసుకున్నారు. దాదాపు అందరి నుంచి నెగిటివ్ టాక్ రావడం వల్ల ఇక సినిమాలో చూడటానికి ఏముంది అనుకుంటూ థియేటర్లకు రాలేదు.   పాజిటివ్ రివ్యూస్ కూడా రాలేదు. సింపుల్‌గా సినిమా బాగోలేదని ఒక టాక్ అనేది పాకిపోయింది. అంటే ఎవరూ ఈ సినిమా చూసేందుకు ముందుకు రావడం లేదు. ఆ కారణంగా మూడో రోజు నుంచి కలెక్షన్లు దాదాపు తక్కువ లక్షలకు పడిపోయాయి. ఈ సినిమాకు ఐదు రోజుల లాంగ్ వీకెండ్ దొరికింది. ప్రీమియర్ సి వేయకుండా ఉన్నట్లయితే ఈ ఐదు రోజులు కూడా సినిమా దాదాపు 30 కోట్లు వసూలు చేసి ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా డైరెక్టర్ హరీశ్ శంకర్ రూ.15 కోట్లు, రవితేజ రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. మిగతా నటీనటుల రెమ్యూనరేషన్, ప్రొడక్షన్ ఖర్చులన్నీ కలిపి రూ.70 కోట్ల ఖర్చు వచ్చింది. ఓటీటీ డీల్, డిజిటల్ రైట్స్ విక్రయించడం ద్వారా  నిర్మాతల పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేసిందని సమాచారం. కానీ భయ్యర్లకు దాదాపు రూ.25 కోట్లకు పైగా నష్టాలు వచ్చేలాగా కనిపిస్తున్నాయి.

అయితే 'మిస్టర్ బచ్చన్' నష్టాలను పూడ్చేందుకు రూ.5 కోట్లు వెనక్కి ఇవ్వాలని డైరెక్టర్ హరీశ్ శంకర్ డిసైడ్ అయినట్టు టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిగా ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: