తెలుగు సినిమా ఇండస్ట్రీలో  బోలెడంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు. కానీ ఆయన తన బ్యాగ్రౌండ్ ని ఏమాత్రం ఉపయోగించుకోకుండా  టాలెంట్ తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మెగా హీరోలంతా ఒకవైపు ఉంటే అల్లు అర్జున్ ఒకవైపు ఉంటాడు. అల్లు అర్జున్ ఏ క్యారెక్టర్ లో అయినా ఇట్టే దూరిపోయే నటుడు. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి అసలు మాటల్లో చెప్పలేం. పుష్ప లుక్, హవభావాలు  అన్ని అభిమానులకు ఎంతో కనెక్ట్ అయ్యాయి. అందుకే ఆ సినిమా అంతటి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అలాంటి పుష్పాకు సీక్వెల్ గా పుష్ప2 సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇదే తరుణంలో షూటింగ్ మధ్యలో ఉండగానే అల్లు అర్జున్  తన గడ్డం తీసేశారని ఒక టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

  అల్లు అర్జున్ సడన్ గా గడ్డం తీసి ఇలా బయటకు రావడం చూస్తే మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  షూటింగ్ కు ఏమైనా బ్రేకులు పడ్డాయ అని భావిస్తున్నారు. అయితే మళ్లీ షూటింగ్ ప్రారంభమయ్యే సరికి టైం పడుతుందని చాలామంది భావించారు. అలా గడ్డం మళ్ళీ పెరుగుతుందని  భావించి గడ్డం తీసేశారట అల్లు అర్జున్. కానీ ఆయన అనుకున్న దాని కంటే ముందే పుష్ప2 షూటింగ్ మళ్లీ మొదలైంది. దీంతో గడ్డం సమస్య వచ్చి పడింది. గడ్డం లేకపోతే ఆ పాత్రకి అసలు జీవమే ఉండదు.

అందుకే అల్లు అర్జున్ కు రియల్ గడ్డంలా  గడ్డాన్ని సృష్టించేందుకు  పుష్ప2 టీం చాలా కష్టపడుతోందట.  ముంబై నుంచి ఒక నిపుణుడిని పిలిపించి బన్నీకి పెట్టుడు గడ్డం సెట్ చేయించారట. ఈ గడ్డం ఖరీదు అక్షరాల 40లక్షలు అన్నట్లు తెలుస్తోంది. పెట్టుడు గడ్డంతో ప్రస్తుతం సినిమా షూటింగ్ కవర్ చేస్తున్నారట బన్నీ. తాజాగా ఆయన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు వచ్చారు అందులో ఆయన గడ్డం కనిపించకపోయే సరికి ఈ వార్త హైలెట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: