మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వచ్చిందంటే చాలు ఆయన అభిమానులు పండగలా భావిస్తారు. తమ అభిమాన నటుడి బర్త్ డే రోజున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గత కొద్ది సంవత్సరాలుగా చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు రోగులకు పండ్లు, వృద్ధులకు దుస్తులు పంపిణీ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆయన బర్త్ డే సందర్భంగా సంబురాలు అంబరాన్ని అంటేలా ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు 22న 68 ఏండ్లు పూర్తి చేసుకుని 69వ ఏట అడుగు పెడుతున్న ఆయనకు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మెగాస్టార్ కు సినీ అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఆయన బర్త్ డే కు కొద్ది గంటల ముందు నుంచే విష్ చేయడం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా మెగాస్టార్ బర్త్ డేకు సంబంధించిన సీడీపీని మెగా హీరో వరుణ్ తేజ్ లాంఛ్ చేశారు. బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత ఈ ఫోటో పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నే మెగాస్టార్ చిరంజీవికి  యంగ్ డైరెక్టర్లు శ్రీకాంత్ ఓదెలా,ప్రశాంత్ వర్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. "జీవితకాలం ఆడే సినిమా చిరంజీవి, జీవితాన్ని మార్చే సినిమా చిరంజీవి, నా వరకు సినిమా అంటే చిరంజీవి, హీరో అంటే చిరంజీవి "అని శ్రీకాంత్ పోస్ట్ చేశారు."ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసిన మెగాస్టార్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశాంత్ వర్మ రాసుకొచ్చారు.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. జనవరి 10, 2025న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. వశిష్ట దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయకుడు కెమెరా బాధ్యతలను చేపట్టారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు అందిస్తున్నారు. ఈ సినిమా విజువల్ ట్రీట్ గా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: