ఏంటి నిజంగానే శోభిత దూళిపాల ఆ హీరోతో ఐటెం సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా.. ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. హాలీవుడ్ రేంజ్ లో తన ప్రస్థానాన్ని విస్తరించుకుంది హీరోయిన్  శోభిత..ఈమె సౌత్ నార్త్ లో మూవీస్ లో కూడా నటించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ చాలా బోల్డ్ గా ఉంటుంది.ఇక ఈ మధ్యనే అక్కినేని నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఆఫిషియల్ న్యూస్ బయటపడింది.దీంతో అక్కినేని కోడలు అంటే మేడం సార్ మేడమ్ అంతే అనేలా ఉండాలి అని కొంతమంది అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు ఇకనుండి బోల్డ్ పాత్రలకు, రొమాన్స్ చేసే పాత్రలకు దూరంగా ఉండాలని అక్కినేని ఫ్యామిలీ కంటే ముందే అభిమానులే కండిషన్లు పెడుతున్నారు.

 అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఆ బాలీవుడ్ హీరోతో శోభిత ధూళిపాల స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు బీటౌన్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్లో డాన్, డాన్ 2 సినిమాలు విడుదలై హిట్ అయ్యాయి.అయితే ఈ మూవీకి సీక్వెల్ గా డాన్ 3 సినిమా కూడా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి లో హీరోగా రణ్ వీర్ సింగ్ నటిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది నుండి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు టాక్. అయితే ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ తో స్పెషల్ సాంగ్ కోసం శోభిత ధూళిపాళ్లతో చర్చలు జరిపినట్టు బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే స్పెషల్ సాంగ్ కోసం శోభిత కూడా పాజిటివ్ గానే స్పందించినట్టు టాక్.దీంతో శోభిత రణ్ వీర్ సింగ్ తో ఐటమ్ సాంగ్స్ చేయబోతుంది అనే రూమర్ బీటౌన్ లో ఊపందుకుంది.దీంతో ఈ విషయం తెలిసిన అక్కినేని అభిమానులు ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఆ సాంగ్లో చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. ఇక అక్కినేని కుటుంబంతో తెగదింపులు చేసుకున్నాక సమంత కూడా పుష్ప సినిమాలో ఉ అంటావా మావా ఉఊ అంటావా అనే ఐటెం సాంగ్ చేసి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది

మరింత సమాచారం తెలుసుకోండి: