తెలుగు చిత్ర పరిశ్రమలో స్వయంకృషి అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా కొనసాగే హీరో ఎవరు అంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవి పేరే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబం నుంచి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన చిరంజీవి.. ఏకంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ అందరి మెగాస్టార్ గా మారిపోయారు. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుల ఇక స్టార్ హీరోగా హవా నడిపిస్తూ ఉన్నారు చిరంజీవి.



 60 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కాగా నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఇక ఆయన నేడు 69వ వడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మెగాస్టార్ చిరంజీవి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆయన తండ్రి కొనిదెల వెంకటరావు మధ్య జరిగిన ఒక ఆసక్తికర ఘటన గురించిన విషయం కాస్త ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది.


 ఒకానొక సమయంలో చిరంజీవిని ఆయన తండ్రి కొనిదెల వెంకటరావు థియేటర్ దగ్గర నుండి రోడ్డు మీద వరకు పరిగెత్తించి మరి కొట్టారట. చిరంజీవి 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తమ్ముడి నాగబాబును తీసుకొని సీనియర్ ఎన్టీఆర్ నటించిన రాము అనే మూవీకి వెళ్లారట. అయితే రిలీజ్ రోజే సినిమా చూడడానికి వెళ్లడంతో ఇక థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందట. ఇక ఎలాగోలా టికెట్ దక్కించుకొని చిరంజీవి, తమ్ముడు నాగబాబు సినిమా చూశారట. అయితే అదే సినిమాకి చిరంజీవి తండ్రి వెంకటరావు కూడా వచ్చారట. ఇక సినిమా అయిపోయాక బయటికి వచ్చినప్పుడు ఇలా చిరంజీవి నాగబాబుని వెంకట్రావు చూశారట. దీంతో అక్కడే ఉన్న కొబ్బరి మట్టలు విరిగేలా చిరంజీవిని ఏకంగా థియేటర్ నుంచి రోడ్డు వరకు పరిగెత్తించి మరి కొట్టారట మెగాస్టార్ తండ్రి వెంకట్ రావు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: