సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో బర్రెలక్క అలియాస్ శిరీష కూడా ఒకరు.. ఎన్ని చదువులు చదివినా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు రావని ఆమె చేసిన ఒక వీడియోతో మంచి పాపులారిటి సంపాదించుకున్నది. ఆ తర్వాత ఈమెకు బర్రెలక్క అని పేరుతో ఓవర్నైట్ కి స్టార్ స్టేటస్ ని అందుకున్నది. ఆ తర్వాత గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఈమె పోటీ చేసిన గెలవలేదు.ఇక ఎంపీగా పోటీ చేసి పాల్గొన్నప్పటికీ మరొకసారి కూడా ఓడిపోయింది.


అయితే ఇప్పుడు మరొకసారి తాజాగా బర్రెలక్క అలియాస్ శిరీష పేరు మరొకసారి వినిపిస్తోంది. అదేమిటంటే ఫేస్బుక్లో చాట్ చేసి డబ్బులు వసూలు చేసిందనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. అది కూడా మన తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటకలోని ఒక ప్రముఖ కన్నడ ఛానల్ లో ఈ వార్తను చూసి ఆమె ఆశ్చర్యపోయి బోరున ఏడుస్తు ఒక వీడియోని సైతం విడుదల చేసింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని విడుదల చేస్తే తనకే పాపం తెలియదు అంటూ తెలుపుతోంది.


అలా డబ్బులు అడిగిన వ్యక్తికి తనకు ఎలాంటి సంబంధం లేదంటు బర్రెలక్క తెలియజేస్తోంది.తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఎవరో ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటు చాలామందిని మోసం చేస్తున్నారని ప్రచారం తన దగ్గరికి వచ్చిందని ఈ న్యూస్ లో తన ఫోటోలతో పాటు పేరు కూడా రావడంతో ఇవన్నీ అవాస్తవమని ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదంటూ ఏడుస్తూ తెలియజేస్తోంది. ఏదో కన్నడ ఛానల్ లో ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నదని అందుకు సంబంధించిన ఆడియోను కూడా వినిపించింది. పెళ్లి చేసుకుని హ్యాపీగా బతుకుతున్న తనకు ఇలాంటి ఇబ్బందులు కావాలని కొంతమంది చేస్తున్నారనే విధంగా తెలియజేస్తోంది. తన పేరు మీద చాలానే సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ఉన్నాయని ఎవరు కూడా ఎలాంటి విషయాలను నమ్మవద్దు అంటే తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: