తాజాగా రిషబ్ జాతీయ అవార్డు అందుకున్నాడు. ‘కాంతార’ సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. దీంతో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. రిషబ్ సాధించిన ఘనత ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. మంచి సినిమాలను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.ప్రస్తుతం కన్నడ సినిమాలో స్టార్ గా వెలుగు వెలుగున్నారు రిషబ్ శెట్టి.  కాంతార సినిమా లో తన నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న రిషబ్ శెట్టి ఇప్పుడు కన్నడ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచాడు. . కాంతారావులోని నటనకు రెండు  జాతీయ అవార్డును అందుకున్నారు, కాంతారతో  జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు.ఇక తాను నటించి దర్శకత్వం వహించిన కాంతార  సినిమాలో ఓ అంతరించిపోతున్న జాతి గురించి  కళ్లకు కట్టినట్టు చూపించిన  రిషబ్‌ శెట్టి.. ఇప్పుడు చేయబోయే కాంతార ప్రీక్వెల్  సినిమాలో సరికొత్త ఫైట్‌ ఆర్ట్‌ చూపించనున్నాడు. అవును, చాలా మందికి తెలిసినట్లుగా, రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా ప్రీక్వెల్ షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమాలో కల్రిపయట్టు యుద్ధ కళను చూపిస్తాడని అంటున్నారు.దీనికి సబంధించిన కలరిపయట్టు ఫైట్‌ను రిషబ్ శెట్టి ఇప్పటికే కేరళలోని ఓ ఎక్స్‌పర్ట్ దగ్గర నేర్చుకున్నాడని అంటున్నారు. ఎంతో కష్టమైనా ఈ కళను.. ఆయన చాలా ఇష్టంగా నేర్చుకన్నాడట. కలరిపయట్టు ఫైట్ ను నేర్చుకునే విధానాన్ని రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాంతారావు ప్రీక్వెల్ ఇప్పటికే 35% షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అందుకు తగ్గట్టుగానే ప్రీక్వెల్ కాంతారా కోసం కష్టపడుతున్నాడు. స్క్రిప్ట్ సిద్దం చేసుకుని..నటి నటుల దగ్గర నుంచి సినిమా సెట్స్ వరకు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు.తాజాగా ఈ సినిమాకి సంబంధించి వీరుడి ఫోజులో ఫిట్గా ఉన్న న్యూలుక్ ఫోటో రిలీజ్ చేశాడు రిషబ్ శెట్టి. ఈ ఫొటోలో రిషబ్ శెట్టి కలరిపయట్టు ప్రాక్టీస్ చేస్తూ..కదనరంగంలోకి దూకుతున్న వీరుడీలా కనిపిస్తున్నాడు. అలాగే ఒక చేతిలో రక్షక కవచం..మరో చేతిలో పదునైన కత్తితో శత్రువుపై దూకడానికి గంబీరమైన కంటి చూపుతో సంసిద్దమైన ఫైటర్ లా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా అప్డేట్ విషయానికి వస్తే..బెంగుళూరు ఔటర్ లో కొన్ని భారీ సెట్లు నిర్మిస్తున్నారు మేకర్స్. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: