ఇండియన్ సినిమా ఈ ఏడాది చూసిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కల్కి 2898 ఏడీ. ప్రభాస్, దీపిక నటించిన, నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఒకేసారి రెండు ఓటీటీల్లోకి రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసి.. ఈ ఘనత సాధించిన ఆరో ఇండియన్ మూవీగా నిలిచింది.ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన విషయం తెలుసు కదా. మొత్తానికి 50 రోజుల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. అది కూడా ఒకేసారి రెండు ఓటీటీల్లో ఈ మూవీ వివిధ భాషల వెర్షన్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఆ వెర్షన్లన్నీ 6 నిమిషాల పాటు ట్రిమ్ కావడం విశేషం.కల్కి 2898 ఏడీ థియేటర్లలో విడుదలైనప్పుడు 181 నిమిషాలు, అంటే 3 గంటల ఒక నిమిషం ఉంది. అప్పుడు సినిమా పాజిటివ్ దక్కించుకున్నప్పటికీ రన్ టైమ్ ఎక్కువ ఉందని కామెంట్లు వినిపించాయి. దీనికి నాగ్ అశ్విన్ కథ కోసం అంత రన్ టైమ్ తప్పలేదని చెప్పినా ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేశాక ఏకంగా 6 నిమిషాలను తగ్గించేశారు. దీంతో ప్రస్తుతం కల్కి రన్ టైమ్ 175 నిమిషాలుగా, అంటే 2 గంటల 55 నిమిషాలు అయింది.ఏ సీన్లు తగ్గించారంటే? - మొదటిది ప్రభాస్ ఇంట్రడక్షన్ సన్నివేశం. ఇందులో ప్రభాస్ను కప్ప అని పిలిచే సీన్ ఉంటుంది. దానిని తీసేశారట.ఇంట్రడక్షన్ సీన్ తర్వాత ఇద్దరు భారీ ఆకారం ఉన్న వ్యక్తులతో ప్రభాస్ ఫైట్ చేస్తారు. ఆ సన్నివేశం నిడివిని తగ్గించారుఇక కాంప్లెక్స్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ దిశా పటానీతో ప్రభాస్ సాంగ్ ను కూడా కత్తిరించేశారు. బీచ్ సీన్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ సీన్లో దీపికా మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే సీన్ ను ట్రిమ్ చేయడంతో ఇంటర్వెల్ కార్డును తీసేశారు.అక్కడ థీమ్ ఆఫ్ కల్కి కొత్త లిరిక్స్ ను జోడించారు. ఇక డబ్బింగ్ లోనూ అక్కడక్కడా పలు మార్పులు చేశారు. దీంతో ఓటీటీ వెర్షన్ థియేటర్ కంటే కాస్త మెరుగ్గా అనిపిస్తోంది. మొత్తానికి సినిమా నిడివి ఆరు నిమిషాలు తగ్గించడంతో కల్కి 2898 ఏడీ మరింత మందిని మెప్పించే అవకాశాలు ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: