ఒక స్టార్ హీరోయిన్‌పై తెలుగు, తమిళ మూవీ ఇండస్ట్రీలు బ్యాన్ విధించాయనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు ఇలియానా. ఈ పేరు వినగానే మనకు నాజుకైన నడుము, ఇన్నోసెన్సే గుర్తుకు వస్తాయి. పర్సనల్ లైఫ్ తనకు నచ్చినట్లు లీడ్‌ చేస్తుందేమో కానీ కాంట్రవర్సీల జోలికి వెళ్లదు. ఇలాంటి తారపై ఎందుకు బ్యాన్ విధించారు? అనేది తెలుసుకుందాం.

 ఇలియానా దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పోకిరి సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమెకు లెక్కలేనని అవకాశాలు యూ కట్టాయి తమిళం హిందీలో కూడా ఎన్నో ఆఫర్లు ఆమెను వరించాయి. పోకిరి సినిమా తర్వాత దాదాపు 5-6 ఏళ్ల దాకా ఆమె కెరీర్‌లో వెనుతిరిగి చూసుకోలేదు. మహేష్, బన్నీ, తారక్, రవితేజ వంటి స్టార్ హీరోయిన్లతో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. అయితే ఆమె సౌత్ ఇండియాలో దూసుకుపోతున్న ఇంట్లోనే హఠాత్తుగా తమిళ తెలుగు ఇండస్ట్రీలకు దూరమైంది.

బాలీవుడ్ పై మోజుతో అటు వెళ్లిపోయింది అని అనుకున్నారు. కానీ అది నిజం కాదు. కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలు ఆమెను బ్యాన్ చేశాయని తాజాగా ఒక నిర్మాత షాకింగ్ విషయం బయట పెట్టాడు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆ నిర్మాత మాట్లాడుతూ.. " ఒకానొక సమయంలో హీరోయిన్ ఇలియానా తమిళ మూవీ నిర్మాత నుంచి రూ.40 లక్షలు అడ్వాన్స్ తీసుకుంది. కానీ ఆ ప్రొడ్యూసర్ కు డేట్స్ ఇవ్వలేదు. డేట్స్ కేటాయించ లేనప్పుడు డబ్బులు అయినా తిరిగి ఇవ్వాలి. కానీ ఆ పని కూడా ఆమె చేయలేదు. సదర నిర్మాత ఇలియానాను చాలా అడిగి చూసాడట కానీ ఫలితం లేకపోవడంతో తెలుగు నిర్మాతలకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు మేము ఆమెకు కాల్ చేశాం." అని చెప్పకొచ్చాడు.

ఇలియానా ఫోన్ చేసినప్పుడు తాను డేట్ ఇచ్చానని కానీ సినిమా అప్పటికి స్టార్ట్ కాలేదని అందుకే వేరే సినిమాలు నటించానని తెలిపిందట. అలాంటప్పుడు అడ్వాన్స్ తిరిగి చేయాలనే ఒక రూల్ ఉంది ఆ రూల్‌ను ఆమె బ్రేక్ చేసింది. సినిమా స్టార్ట్ కాలేదు కాబట్టి వేరే సినిమాలో నటించడం ఆమె ఇష్టం కానీ డబ్బు దగ్గరే ఉంచుకొని నిర్మాత సినిమాలో నటించకపోతే అది నేరం. ఇదే విషయాన్ని సదరు నిర్మాత చెబుతూ ఆమెను బ్యాన్ చేసినట్లు తెలిపాడు. బ్యాన్ చేసే సమయం నాటికి ఇలియానా ‘నన్బన్’లో యాక్ట్ చేస్తోందని, అదే ఆమెకు చివరి సినిమా అని కూడా తాము చెప్పినట్లు పేర్కొన్నాడు. 2012లో ఆమెపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఆరేళ్ల పాటు ఆమె తెలుగు తమిళ సినిమాలు నటించలేదు. 2018 లో  ‘అమర్ అక్బల్ ఆంటోని’ మా చేసింది దానితో ఆమెపై దాని లిఫ్ట్ చేసినట్టుగా తెలిసింది అయితే ఆ మూవీ ఫెయిల్ కావడంతో ఆమె సౌత్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: