ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబల్ ఇస్మార్ట్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. ఈ 7 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ పూర్తి అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.89 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.42 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.15 కోట్లు , ఈస్ట్ లో 73 లక్షలు , వెస్ట్ లో 42 లక్షలు ,  గుంటూరు లో 96 లక్షలు , కృష్ణ లో 60 లక్షలు , నెల్లూరు లో 34 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7 రోజుల్లో 9.51 కోట్ల షేర్ , 14.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 7 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 98 లక్షల కలెక్షన్లు దక్కగా ... ఓవర్ సీస్ లో 78 లక్షల లక్షల దక్కాయి.


మొత్తంగా ఈ సినిమాకి 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 11.27 కోట్ల షేర్ , 18.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 37.73 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ ను అందుకుంటుంది. కావ్య దాపర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. పూరి జగన్నాథ్ , చార్మి సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: