మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య వరుస అపజాయలతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయాడు. ఇలా వరుస అపజాయతో డిలా పడిపోయిన రవితేజ తాజాగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన థియేటర్లో విడుదల అయింది. ఈ సినిమాకు కూడా నెగటివ్ టాక్ వచ్చింది. దానితో చాలా పేలవమైన కలెక్షన్లు ఈ మూవీ.కి బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 7 రోజుల బాక్స్ ఆఫీసర్ కంప్లీట్ అయ్యింది. ఈ 7 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 7 రోజుల్లో నైజాం ఏరియాలో 3.03 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.13 కోట్లు , ఉత్తరాంధ్రలో 77 లక్షలు , ఈస్ట్ లో 46 లక్షలు , వెస్ట్ లో 35 లక్షలు , గుంటూరు లో 54 లక్షలు , కృష్ణ లో 35 లక్షలు , నెల్లూరు లో 27 లక్షఎల్ కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో కలిపి ఈ మూవీ కి 6.90 కోట్ల షేర్ , 11.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 7 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 45 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్ సీస్ లో 57 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 7.92 కోట్ల షేర్ , 13.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 24.05 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: