మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ.కి బింబిసారా ఫేమ్ మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని త్రిష ఈ సినిమాలో చిరంజీవి కి జోడిగా కనిపించబోతుంది. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే నిన్న అనగా ఆగస్టు 22 వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు అనే విషయం మనకు తెలిసిందే. 

దానితో ఈ సినిమా నుండి ఆగస్టు 22 వ తేదీన టీజర్ ను ఈ మూవీ బృందం వారు విడుదల చేయనున్నారు అని అనేక వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఈ మూవీ బృందం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను కాకుండా చిరంజీవి కి సంబంధించిన ఈ మూవీ లోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా కాలమే ఉన్న ఈ మూవీ కి సంబంధించిన థియేటర్ హక్కులను ఈ మూవీ మేకర్స్ అమ్మి వేస్తూ వస్తున్నారు.

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓవర్ సీస్ హక్కులను ఈ మూవీ యూనిట్ అమ్మి వేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడింది. ఈ సినిమా యొక్క ఓవర్ సీస్ హక్కులను సరిగమ సినిమా , భరత్ అమెరికన్ సంస్థలు దక్కించుకున్నాయి. ఇకపోతే ఈ సంస్థలు విశ్వంభర మూవీ ఓవర్ సిస్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు కూడా ఓవర్ సిస్ లో ఈ సినిమాను అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: