టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగార్జున ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి ఎన్నో సంవత్సరాలు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరీర్ ను కొనసాగించాడు. ఇప్పటికే కూడా నాగ్ మంచి విజయాలను అందుకుంటు సీనియర్ స్టార్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలు రీ రిలీస్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా సీనియర్ స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతున్నాయి.

నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఆయన నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అయినటువంటి ఇంద్ర మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రీ రిలీస్ చేశారు. ఆ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఆగస్టు 29 వ తేదీన అక్కినేని నాగార్జున పుట్టిన రోజు అనే విషయం మనకు తెలిసిందే. దానితో ఈయన పుట్టిన రోజు సందర్భంగా నాగర్జున కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్నటువంటి మాస్ మూవీ ని ఆగస్టు 28 వ తేదీన భారీ ఎత్తున రీ రిలీజ్ చేయనున్నారు.

దానితో ఈ మూవీ బృందం వారు ఆగస్టు 23 వ తేదీన సాయంత్రం 4 గంటల 32 నిమిషాలకు మాస్ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా నాగార్జున మాస్ మూవీ రీ రిలీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ ఇంపాక్ట్ ను చూపిస్తాడో చూడాలి. ఈ సినిమాలో నాగార్జున కు జోడిగా జ్యోతిక , చార్మి హీరోయిన్లుగా నటించగా ... రాఘవ లారెన్స్మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: