ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న రామ్ చరణ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన చరణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. తక్కువ సినిమాలతోనే ఏకంగా టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకడిగా మారిపోయాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా అవతారం ఎత్తాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 అయితే అభిమానులను మెప్పించేందుకు ఎప్పుడు ఎంతో కష్టపడే రామ్ చరణ్.. ఇక త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత క్రేజీ లైన్ అప్ తో ముందుకు సాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్తో చేసిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కి సిద్ధమవుతుంది. కొంతమంది క్రేజీ డైరెక్టర్లు చెప్పిన కథలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు అని చెప్పాలి. అయితే అటు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనాతో ఒక మూవీ చేయడానికి రెడీ అయ్యాడు చరణ్. సాధారణంగా రామ్ చరణ్ తన కెరియర్ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో నటించాడు. చాలామంది హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాలలో కూడా కనిపించాడు. అలాంటి రామ్ చరణ్ కు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.


 అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాంచరణ్ ఇండస్ట్రీలో తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత తన ఫేవరెట్ అంటూ తెలిపాడు చరణ్. అయితే సమంత - చరన్ కాంబోలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. అంతేకాదు చరణ్, సమంత మధ్య లిప్ లాక్ సన్నివేశం కూడా ఒకటి ఉంటుంది. కాగా ఇటీవల ఇంటర్వ్యూలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అన్న ప్రశ్నకు సమంత అంటూ సమాధానం చెప్పాడు చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: