తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరుగా కొనసాగుతూ ఉన్నాడు ఆక్కినేని నాగార్జున. నాగేశ్వరరావు నట వారసత్వాన్ని అందుకున్న నాగార్జున ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. 60 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా టాలీవుడ్ మన్మధుడు గానే ఆయన కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. ఒకవైపు ఇక టీవీ షోలో హోస్టుగా చేస్తూనే ఇంకోవైపు అటు హీరోగా కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. 60 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చే విధంగా ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు నాగార్జున.


 అయితే ఇప్పటివరకు నాగార్జున ఎంతోమంది దర్శకులతో సినిమాలు చేశారు. కొంతమంది దర్శకులతో సూపర్ హిట్లు కూడా ఉన్నాయి. అయితే ఇలా నాగార్జున ఎంతమంది డైరెక్టర్లతో సినిమా తీసిన నాగార్జున తో సినిమా తీసి క్రేజీ డైరెక్టర్గా పేరు సంపాదించుకుంది మాత్రం రాంగోపాల్ వర్మ. ఎందుకంటే నాగ్ తో ఏకంగా శివ అనే సినిమా తీసి ఇండస్ట్రీని ఊపేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇక ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ అభిమానులకు ఫేవరెట్ కాంబో గా మారిపోయింది. శివ సినిమాతో నాగార్జునకు సూపర్ హిట్ ఇచ్చిన రాంగోపాల్ వర్మ.. ఒక మూవీ ని మాత్రం నాగార్జునతో తీయాలని మరో హీరోతో తీశాడట.


 రాంగోపాల్ వర్మ టాలీవుడ్ లో సూపర్ హిట్లు కొడుతూనే బాలీవుడ్ లోకి వెళ్లెందుకు ప్రయత్నించారు. అక్కడ క్రేజీ సినిమాలో తీశారు. అయితే హిందీలో హిట్టు కొట్టిన ఒక సినిమాను నాగార్జునతో తీయాలని మొదటి అనుకున్నాడట వర్మ. నాగార్జున సరసన శ్రీదేవిని నటింప చేయాలని అనుకున్నాడట. కానీ కొన్ని కారణాలవల్ల ఇక నాగార్జున స్థానంలో అమీర్ ఖాన్ హీరోగా చేయాల్సి వచ్చింది.  నాలుగు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 33 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. బ్లాక్ బస్టర్గా నిలిచిందట. ఆ మూవీ ఏదో కాదు అప్పట్లో అమీర్ ఖాన్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన రంగీలా. ఈ విషయం తెలిసి నాగార్జునకు ఈ సినిమా పడి ఉంటే బాలీవుడ్ లో కూడా చక్రం తిప్పేవాడు అంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: