లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రావు రమేష్ ప్రధాన పాత్రలో,ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం.పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్స్ పై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత సమర్పణలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నేడు విడుదలైన ఈ సినిమా కథ ఏంటి? ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించింది అనే విషయానికి వస్తే..

కథ: సుబ్రహ్మణ్యం(రావు రమేష్) చిన్నప్పట్నుంచి గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా వచ్చిన ప్రతి జాబ్ అప్లై చేస్తూ ఉన్నా ఏది రాదు. ఇలా గవర్నమెంట్ జాబు కోసం ప్రయత్నాలు చేస్తూనే పెళ్లి కూడా చేసుకుంటారు ఇక ఈయన భార్య కళారాణి (ఇంద్రజ) కి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంతేకాకుండా సుబ్రహ్మణ్యం కూడా ఒక జాబుకు ఎంపిక అవుతారు కానీ ఆ జాబుకు సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఆయనకు రాదు అది కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఉంటుంది.

ఎప్పటికైనా తణుకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని సుబ్రహ్మణ్యం ఎదురు చూస్తూనే తన భార్య సంపాదన పై బ్రతుకుతూ తనకు భయపడుతూనే ఉంటాడు. ఇక వీరి కొడుకు అర్జున్(అంకిత్) తను అల్లు అరవింద్ కొడుకని, అల్లు అర్జున్ తమ్ముడు అని కలలు కంటూ ఉంటాడు. తొలిచూపులోనే కాంచన(రమ్య)తో ప్రేమలో పడతారు. అయితే అనుకోకుండా ఒక రోజు సుబ్రహ్మణ్యం అకౌంట్లో పది లక్షల డబ్బులు క్రెడిట్ అవుతాయి ఆ డబ్బులు ఎవరు వేశారు అనే విషయం తెలియక ఈ తండ్రీ కొడుకులిద్దరూ జుట్టు పీక్కుంటారు ఏదైతేనేం వచ్చిన డబ్బులను వారి అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేస్తూ ఉంటారు.. మరి కోర్టులో పెండింగ్లో ఉన్న జాబ్ సుబ్రహ్మణ్యం కి వస్తుందా? ఆ పది లక్షలు వీరి అకౌంట్లో ఎలా పడ్డాయి? రమ్యతో అర్జున్ ప్రేమ ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన:  నటుడు రావు రమేష్ ఇన్ని రోజులు సీరియస్ తండ్రి పాత్రలలోను విలన్ పాత్రలలో నటించి మెప్పించారు. అయితే మొదటిసారి ఈయన ఫుల్ లెన్త్ కామెడీ స్టోరీ లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. కళారాణి పాత్రలో ఇంద్రజ అద్భుతంగా నటించింది. ఇక అంకిత్ కొయ్య తన నటనతో ఇటీవల వరుస సక్సెస్ లో అందుకుంటున్నారు. ఇక రమ్య పసుపులేటి కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఎవరి పాత్రలకు వారు పూర్తిగా న్యాయం చేశారు.

టెక్నికల్: టెక్నికల్ విషయానికి వస్తే మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. పాటలు బాగున్నాయి ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల అద్భుతంగా అనిపించింది.ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ ఇంకొంచెం కట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. కొత్త కథ, కొత్త కథనంతో దర్శకుడు లక్ష్మణ్ ఈ సినిమానికి ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఇక నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి.

విశ్లేషణ: మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈ సినిమా మొదటి నుంచి కూడా ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తూ కామెడీ ఎంటర్టైనర్ గా కొనసాగుతుంది. ఇలా నవ్విస్తూనే మధ్యలో కాస్త ఎమోషనల్ సన్నివేశాలు పెట్టారు అవి కాస్త వర్క్ అవుట్ అవ్వలేదని చెప్పాలి. ఇక ఫస్ట్ ఆఫ్ మొత్తం చాలా సరదా సరదాగా సాగిపోతుంది సెకండ్ హాఫ్ లో అకౌంట్లో పడిన డబ్బులు ఖర్చు అయ్యాక వారు పడిన ఇబ్బందులను చూపించడమే కాకుండా క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉంది.రెండు మూడు సీన్స్ తప్ప సినిమాలోని ప్రతి సీన్ కి నవ్వుతూనే ఉంటారు ప్రేక్షకులు. సినిమాలో అల్లు అర్జున్ రిఫరెన్సులు చాలానే ఉన్నాయి. బన్నీ ఫ్యాన్స్ కి ఈ సినిమా పండగే అని చెప్పాలి. మొత్తానికి ఈ సినిమా చూసిన తర్వాత ఎంతో సంతృప్తిగా ప్రేక్షకులు బయటకు వస్తారని చెప్పాలి.

బాటమ్ లైన్: ఎలాంటి ఉద్యోగం లేకుండా ఒక సాధారణ మధ్య తరగతి తండ్రి అకౌంట్లో డబ్బులు పడితే ఎలా ఉంటుంది అనే అంశం ద్వారా ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు.

రేటింగ్: 3/5

మరింత సమాచారం తెలుసుకోండి: