ఈ మధ్య కాలంలో మన తెలుగు సినీ పరిశ్రమలో ప్రీమియర్ షో ల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు చాలా పెద్ద సినిమాలకు దాదాపుగా హిట్ అవుతుంది అనే సినిమాలకు మాత్రమే ఒక రోజు ముందుగా పెయిడ్ ప్రీమియర్ షో లను ప్రదర్శించేవారు. కానీ ఈ మధ్య కాలంలో దాదాపుగా ప్రతి సినిమాకు ఒక రోజు ముందు లేదా అంత కన్నా ముందే పెయిడ్ ప్రీమియర్ షో లను ప్రదర్శిస్తున్నారు. ఇకపోతే ఈ ప్రీమియర్ షో ల ద్వారా ఒక ప్రయోజనం మరియు మరొక నష్టం కూడా ఉంది. అది ఏమిటి అనుకుంటున్నారా.

ప్రీమియర్ షో లు అనేవి సినిమా విడుదలకు ఒక రోజు ముందు అంత కన్నా ముందు ప్రదర్శిస్తారు. అలా ప్రదర్శించడం వల్ల కొంత మంది సినిమాలు చూసేస్తారు. సినిమా కనుక బాగున్నట్లు అయితే మూవీ విడుదల రోజు దానికి అద్భుతమైన కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కే అవకాశాలు ఉంటాయి. అదే సినిమా కనుక బాగోలేదు అని టాక్ వచ్చినట్లు అయితే మొదటి రోజు కలెక్షన్ లకి కూడా దెబ్బ పడే అవకాశం ఉంటుంది. ఇలా ఈ మధ్య కాలంలో మిస్టర్ బచ్చన్ సినిమాకు జరిగింది. మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15 వ తేదీన విడుదల కానుండగా ఆగస్టు 14 వ తేదీనే కొన్ని ప్రాంతాలలో ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ షో లను ప్రదర్శించారు.

ఇకపోతే ఈ పెయిడ్ ప్రీమియర్ ద్వారానే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల అయిన మొదటి రోజు కలెక్షన్ల విషయంలో ఈ సినిమా వెనకబడిపోయింది. దానితో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు గట్టి ఓపెనింగ్స్ రాలేదు. మిస్టర్ బచ్చన్ మూవీ కి గనుక పెయిడ్ ప్రీమియర్స్ ను ఒక రోజు ముందుగా ప్రదర్శించనట్లయితే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మంచి కలెక్షన్లు వచ్చి ఉండేవి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: