మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరుత సినిమాలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అతి తక్కువ టైంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. తమ రెండవ సినిమాకి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రామ్ చరణ్ తేజ్ మొదట్లో ఎంత అగ్రెసివ్ గా ఉండేవాడో అందరికీ తెలిసిందే. అయితే ఎదిగే కొద్దీ ఒదగాలి అనే విషయం మాత్రం రామ్ చరణ్ తేజ్ కెరీర్ ని చూసి ఖచ్చితంగా గమనించాలి అని చెప్పాలి. తనకు స్టార్డం వస్తున్న టైం లో చాలా సైలెంట్ అయిపోయాడు చరణ్ తేజ్.రామ్ చరణ్ తేజ్ కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా రంగస్థలం సినిమా అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చరణ్ లో పరిపూర్ణమైన నటుడును బయటకు తీసిన సినిమా రంగస్థలం. అప్పటివరకు వరుసగా సినిమాలు చేస్తున్న రామ్ చరణ్ ను ఒక్కసారి పది మెట్లు ఎక్కించిన సినిమా రంగస్థలం. ఈ సినిమాలో చిట్టిబాబు అనే పాత్రలో ఒదిగిపోయాడు రామ్ చరణ్. మామూలుగా ఈ పాత్రను నటులు ఎవరైనా చేస్తారు. కానీ చిన్నప్పటినుంచి గోల్డెన్ స్పూన్ తో పెరిగిన రాంచరణ్ ఈ పాత్రను చేయడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ కి గ్లోబల్ స్టార్ అని ఒక బిరుదు ఉంది. తండ్రికి తగ్గ తనయుడు నుంచి తండ్రిని మించిన తనయుడు అనే రేంజ్ కు రామ్ చరణ్ తేజ్ ఎదిగాడు అనేది కచ్చితంగా చెప్పాల్సిన విషయం.

ఇక రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అది కామెడీ ప్రధానం గా ఉంటుందని చరణ్ ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. మీరు థ్రిల్లర్ ను ఇష్టపడతారా లేక కామెడీ నా అన్న ప్రశ్నకు బదులిచ్చారు. నా సినిమాల్లో కామెడీ ఎప్పుడు చేయలేదు. నెక్స్ట్ బుచ్చిబాబు సనాతో చేసే సినిమా అలానే ఉంటుంది అని తెలిపారు.ఇదిలావుండగా తనకు హీరోల్లో సూర్య అంటే, అలాగే హీరోయిన్స్ లో సమంత అంటే ఇష్టమని వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ గ్రౌండ్ లో ఉండబోతున్నట్లు ఇదివరకు అనౌన్స్ చేశారు.ఇకపోతే ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసను చరణ్ ఎలా మాట్లాడుతాడు అని అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంది. ఇకపోతే రాంచరణ్ తన కెరియర్లో కంప్లీట్ కామెడీ ఫిలిం చేయలేదు. ఇక రీసెంట్ గా ఈ సినిమాలో కంప్లీట్ కామెడీ ఉంటుంది అంటూ అధికారికంగా ఒక వేడుకలో చెప్పవచ్చాడు రామ్ చరణ్. చరణ్ కామెడీ టైమింగ్ కొన్ని సినిమాల్లో బయటికి వచ్చింది తప్ప. కంప్లీట్ గా చరణ్ కామెడీ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటివరకు ఎవరికీ తెలియలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: