ఐఫా (IIFA) అవార్డుల కార్యక్రమం దుబాయ్, మలేషియా వంటి దేశాల్లోనే కాకుండా ఇండియాలో కూడా ఘనంగా జరుగుతుంది. ఈసారి కూడా ఈ అవార్డుల ప్రదానోత్సవంలో జరగనుంది. అయితే ఈ సారి ఈ అవార్డుల ఫంక్షన్‌లో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి నాని హీరోగా నటించిన దసరా మూవీ ఏకంగా 10 విభాగాలలో నామినేట్ అయ్యి సంచలనం సృష్టించింది. దాని తర్వాత నరసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్‌ కేసరి ఎక్కువ నామినేషన్లతో బలంగా గర్జించింది.

"భగవంత్‌ కేసరి బ్లాక్ బస్టర్ గర్జన అవార్డుల ఉత్సవాలలో కూడా కొనసాగుతోంది. ఈ చిత్రం ఐఫాలో 4 ప్రధాన అవార్డుల విభాగాల్లో నామినేట్ అయింది." అని ఈ మూవీ నిర్మించిన సన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ హౌస్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. నాలుగు విభాగాల్లో మొదటి విభాగం బెస్ట్ పిక్చర్. బెస్ట్ పిక్చర్ విభాగంలో భగవంత్‌ కేసరి పోటీలోకి దిగింది. ఓట్లు ఎక్కువగా పడితే ఈ సినిమానే బెస్ట్ పిక్చర్ అవార్డు అందుకునే అవకాశం ఉంది. బెస్ట్ పర్ఫామెన్స్ ఇన్ ఏ లీడింగ్ రోల్ (మేల్) కేటగిరిలో బాలకృష్ణ సెలెక్ట్ నామినేట్ అయ్యారు. భగవంత్‌ కేసరి సినిమాలోని పర్ఫామెన్స్ వల్లే ఈ నామినేషన్ దక్కింది.



తర్వాత అనిల్ రావిపూడి (భగవంత్‌ కేసరి) బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో నామినేట్ అయ్యారు. బెస్ట్ పర్ఫామెన్స్ ఇన్ ఏ లీడింగ్ రోల్ (ఫీమేల్) కేటగిరిలో బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీ లీల సెలెక్ట్ నామినేట్ అయ్యారు. ఇందులో శ్రీలీల విజయలక్ష్మిగా "విజ్జి"గా చాలా బాగా నటించి అలరించింది. ఈ సినిమాలో అంతటి బాలకృష్ణకి పోటీగా శ్రీలీల కనబర్చి వావ్ అనిపించింది. ఇద్దరి పర్ఫామెన్స్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి. వారిద్దరి కాంబో సీన్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కథ కూడా చాలా బాగుంటుంది ఎమోషనల్ గా సాగుతుంది ఉమెన్ ఎంపవర్మెంట్ ని బాగా నొక్కి చెబుతుంది. బాలయ్య తో ఇలాంటి మంచి సినిమా తీసినందుకు అనిల్ కు కూడా అవార్డు దక్కాల్సిందే అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: