కొంత మంది హీరోలు ఒక సారి ఒక దర్శకుడితో సినిమా చేశాక ఆ దర్శకుడు కనుక వారికి భారీ ఫ్లాప్ ను ఇచ్చినట్లు అయితే మళ్లీ ఆదర్శకుడితో సినిమా చేయడానికి ఇష్టపడరు. కానీ మరి కొంత మంది హీరోలు మాత్రం ఒక సారి ఒక దర్శకుడి తో పని చేసిన తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా సినిమా చిత్రీకరణ దశలో ఉండగా ఆయన పని తనం నచ్చే మరొక అవకాశం ఇచ్చే వారు కూడా ఉంటారు. అలాంటి వారిలో గోపీచంద్ ఒకరు.

ఈయన ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో సార్లు తన సినిమాలకు దర్శకత్వం వహించి బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ కు అపజయాన్ని ఇచ్చిన కూడా సినిమా చిత్రీకరణ సమయంలో వారి పని తనం నచ్చి వారిలో టాలెంట్ ఉంది అనుకున్నట్లు అయితే వారికి రెండవ అవకాశం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే గోపీచంద్ కొన్ని సంవత్సరాల క్రితం జిల్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటించగా ... రాధాకృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు.

ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఈ మూవీ అపజయం అందుకున్న గోపీచంద్ మరో సారి రాధాకృష్ణ కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే రాధాకృష్ణ , గోపీచంద్ కు ఓ కథను వినిపించగా ... ఆ కథ బాగా నచ్చడంతో ఈయన దర్శకత్వంలో సినిమా చేయడానికి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , మరికొన్ని రోజుల్లోనే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ఈ వార్త ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: