మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో చాలా సినిమాలను వదులుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా చిరంజీవి వదులుకున్న సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినా మరికొన్ని సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సినిమాలు ఉన్నాయి. అలా చిరంజీవి వదులుకున్న ఒక సినిమాను బాలకృష్ణ చేయగా అది బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ కు ఆ మూవీ అద్భుతమైన గుర్తింపును తీసుకు వచ్చింది. ఆ సినిమా ఏది ..? అసలు చిరంజీవి దానిని ఎందుకు వదిలి వేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ హీరో గా సుహాసిని హీరోయిన్ గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో మంగమ్మ గారి మనవడు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే కోటి రామకృష్ణమూవీ కథను మొదటగా చిరంజీవి కి వినిపించాడట. సినిమా కథ మొత్తం విన్న చిరంజీవి కి ఈ కథ అంతగా నచ్చలేదట. దానితో కోడి రామకృష్ణ కు ఈ సినిమా కథ నచ్చలేదు అని చెప్పాడట. దానితో కోడి రామకృష్ణ ఇదే మూవీ కథను బాలకృష్ణ కు వినిపించగా ఆయనకు సినిమా కథ సూపర్ గా నచ్చడంతో ఆయన ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దానితో ఈ మూవీ ని మంగమ్మ గారి మనవడు అనే టైటిల్ తో రూపొందించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని బా క్సాఫీస్ దగ్గర అందుకుంది. అలా చిరంజీవి మిస్ చేసుకున్న ఈ మూవీ తో బాలకృష్ణ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: