పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలను వదులుకున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ వదిలేసిన కొన్ని సినిమాలలో రవితేజ కూడా నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే రవితేజతో అనుకున్న ఒక మూవీ లో పవన్ కళ్యాణ్ నటించిన విషయం మీకు తెలుసా. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం కూడా అందుకుంది. ఆ సినిమా ఏది ... దాని వివరాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ హీరోగా హరీష్ శంకర్ షాక్ అనే మూవీ ని రూపొందించాడు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత రవితేజ రెండవ అవకాశం ఇవ్వడంతో హరీష్ శంకర్ "మిరపకాయ్" అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇక హరీష్ శంకర్ ఆ తర్వాత కూడా రవితేజ తో ఓ సినిమా చేయాలి అనుకున్నాడు. అందులో భాగంగా ఆయనతో హిందీ లో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న దబాంగ్ మూవీ ని రవితేజ తో రీమిక్ చేస్తే బాగుంటుంది అని ఆలోచనకు కూడా దర్శకుడు వచ్చాడట. ఆ లోపే పవన్ కళ్యాణ్ నుండి హరీష్ శంకర్ కి ఆఫర్ వచ్చిందట.

అందులో భాగంగా ఈయనకు హిందీలో దబంగ్ అనే మూవీ వచ్చింది. దానిని పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం ఈ దర్శకుడికి వచ్చిందట. దానితో అప్పటికే దబాంగ్ సినిమాపై ఇంట్రెస్ట్ గా ఉన్న హరీష్ శంకర్ దానిని రవితేజ తో కాకుండా పవన్ కళ్యాణ్ తో చేస్తే బాగుంటుంది అని ఆలోచనకు వచ్చి పవన్ తో దబాంగ్ మూవీ ని గబ్బర్ సింగ్ అనే టైటిల్ తో రీమిక్ చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. అలా రవితేజ తో అనుకున్న మూవీ ని హరీష్ శంకర్ , పవన్ తో తీసే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: