టాలీవుడ్ హీరో నాగ చైతన్య 'సవ్యసాచి' ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ నిధి అగర్వాల్..  అందం, అభినయంతో మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఫస్ట్ సినిమానే ఆమెకు షాక్ కు గురి చేసింది. ఊహించినంత రేంజ్ లో ఈ సినిమా హిట్ కాకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ 'మిస్టర్ మజ్నూ'లో నటించినా.. అదీ బెడిసికొట్టింది. అలా ఫ్లాప్ లతో సాగుతున్న ఆమె కెరీర్ లో ఓ బెస్ట్ ఛాన్స్ వచ్చింది. అదే 'ఇస్మార్ట్ శంకర్'. ఎలాగోలా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన భామ.. అనుకున్నట్టుగానే మూవీ భారీ సక్సెస్ అయింది. కానీ ఆ తర్వాత వచ్చిన హీరో కూడా ఫ్లాపే. దీంతో ఆమెకు మళ్లీ సినిమా కష్టాలు మొదలయ్యాయి.నిధి అగ‌ర్వాల్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించి రెండేళ్లు దాటిపోయింది. హీరో మూవీతో 2022 ఆరంభంలో చివ‌ర‌గా తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చింది నిధి అగ‌ర్వాల్‌. హీరో డిజాస్ట‌ర్ కావ‌డంతో నిధికి మ‌రో అవ‌కాశం ద‌క్క‌లేదు.టాలీవుడ్‌లో రీఎంట్రీ కోసం గ‌త రెండేళ్లుగా ఎదురుచూస్తోంది నిధి అగ‌ర్వాల్‌. ఈ బ్యూటీ  నిరీక్ష‌ణ‌కు ఈ ఏడాది తెర‌ప‌డ‌టం ఖాయంగానే క‌నిపిస్తోంది.సినిమాల ప‌రంగా హిట్స్ లేక‌పోయినా ఇన్‌స్టాగ్రామ్‌లో నిధి అగ‌ర్వాల్‌కు 30 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు.
ఇద్దరు సూపర్‌స్టార్లతో ఒకేటైమ్‌లో జతకట్టి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది నిధి అగర్వాల్‌. ఇటీవల ముంబయ్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో తన సినిమాల గురించి మాట్లాడింది నిధి. ' పవన్‌ సార్‌ 'హరిహరవీరమల్లు'లో రాజుల కాలంనాటి పాత్ర చేస్తున్నా.ఇందులో నా పాత్ర గమ్మత్తుగా, రొమాంటిక్‌గా ఉంటుంది. వపన్‌సార్‌, నేనూ కలిసి నటించిన సన్నివేశాలు పొయెటిక్‌గా ఉంటాయి. ఓల్డ్‌ క్లాసిక్స్‌ చూసిన ఫీల్‌ కలుగుతుంది. అలాగే.. ప్రభాస్‌ 'రాజా సాబ్‌’లో కూడా భిన్నమైన పాత్ర చేస్తున్నాను. ఈ తరహా సినిమా చేయడం ప్రభాస్‌తో పాటు నాకూ కొత్తే. ఏదేమైనా ఇద్దరు సూపర్‌స్టార్లతో కలిసి నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్‌.కౌంట్‌ కంటే కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నది ఈ అందాలనిధి. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుతో పాటు ప్ర‌భాస్ రాజాసాబ్ సినిమాల్లో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నిధి అగ‌ర్వాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు మేక‌ర్స్ స్పెష‌ల్‌ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో యువ‌రాణిగా నిధి అగ‌ర్వాల్ క‌నిపించింది.రాజా సాబ్ సెట్స్‌లో నిధి అగ‌ర్వాల్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌ జ‌రిగాయి. ఈ సెల‌బ్రేష‌న్స్‌తోనే రాజాసాబ్‌లో నిధి న‌టించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ఆఫీషియ‌ల్‌గా వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: