నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. కొంత కాలం క్రితం అఖండ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య ఆ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి మూవీలలో వరుస విజయాలను అందుకొని ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణమూవీ చేయాలి అనుకున్నాడు. అందులో ఒక బాలీవుడ్ స్టార్ నటుడు ఉంటే బాగుంటుంది అని ఆలోచనకు మేకర్స్ అంతా వచ్చారు. కానీ ఆ నటుడు ఆ సినిమాలో నటించను అని చెప్పడంతో ఆ సినిమానే క్యాన్సల్ అయింది. ఆ నటుడు ఎవరు ..? అసలు ఏం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ , బాలకృష్ణ హీరో గా ఓ మూవీ చేయాలి అనుకున్నాడు. అందులో భాగంగా ఆయనకు కథ చెప్పగా అద్భుతంగా ఉంది చేద్దాం అని బాలయ్యమూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కానీ అందులో బాలకృష్ణ తో పాటు మరో కీలక పాత్ర కూడా ఉంటుందట. దానిలో బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబచ్చన్ ని తీసుకోవాలి అని మూవీ మేకర్స్ అనుకున్నారట. అందులో భాగంగా అమితాబ్ బచ్చన్ ను సంప్రదించగా ఆయన కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించలేను అని చెప్పాడట. దానితో ఆ సినిమానే ఆపేసారట. అలా అమితాబచ్చన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో బాలయ్య , కృష్ణ వంశీ కాంబోలో రావలసిన మూవీ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: