మెగాస్టార్ రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా చిరంజీవి ఆయనకు చేదోడుగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రామ్ చరణ్ సినిమా కథల ఎంపికలో చిరంజీవి జోక్యం ఉంటుంది. రామ్ చరణ్ సినిమాల విషయంలో చిరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అటు రామ్ చరణ్ సైతం తండ్రి మాటను కాదనకుండా ఆయన చెప్పిన ప్రతి పని చేస్తుంటారు.ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్  ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ అనే ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే…  ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తున్నారు.. రామ్ చరణ్ తన తండ్రి 69వ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి చిరంజీవికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అతను తన కుమార్తె క్లిన్ కారా తన తాతామామలతో కలిసి చేసిన మొదటి పర్యటన యొక్క అరుదైన ఫోటోను కూడా పోస్ట్ చేశాడు.ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నలుమూలల నుండి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా చిరుతో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్ సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. దీనికి సంబంధించిన ఫోటోను చెర్రీ ఇన్స్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ అవుతుంది.ఆ పోస్టులో తండ్రికి తమిళ స్టైల్ లో విష్ చేయడం గమనార్హం. చిరు తిరుమల నుంచి తిరిగి రాగానే ఈ ఫోటో తీసుకున్నట్లు సమాచారం. కుర్తా మరియు ముండు (దక్షిణాది రాష్ట్రాల్లో నడుము చుట్టూ ధరించే వస్త్రాలు) తో కవలలుగా ఉన్న వారి ఫోటోను పోస్ట్ చేయడం ద్వారా రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపారు."పుట్టినరోజు శుభాకాంక్షలు అప్పా" అని పోస్ట్‌ను షేర్ చేస్తూ రామ్ చరణ్ రాశారు.ఇదిలా ఉండగామెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా  చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ 'విశ్వంభర' మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బిగ్ మాస్ బొనాంజాతో ముందుకు వచ్చారు.వెన్ మైత్స్  కాలిడే లెజెండ్స్ రైజ్ ' అనే కోట్‌తో వున్న ఈ వండర్ ఫుల్ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి ఒక రాతిపై కూర్చొని, ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని పట్టుకుని పవర్ ఫుల్ గా కనిపించారు. మెగాస్టార్ చరిష్మాటిక్ లుక్, కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరపులతో కూడిన ఈ ఫస్ట్ లుక్ అదిరిపోయింది.చిరంజీవి త్రిశూలం వైపు ఇంటెన్స్ లుక్స్ తో చూస్తూ యూత్ ఫుల్ అండ్ డైనమిక్‌గా కనిపించారు. విజువల్‌గా అద్భుతమైన ఈ ఫస్ట్‌లుక్ స్ట్రాంగ్ బజ్‌ని క్రియేట్ చేసింది. సినిమాపై అంచనాలను పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: