గతకొంత కాలంగా అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాల ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే ఈ జంట ఒకటి కానుందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తూ వచ్చాయి. నేడు ఈ వార్తలను నిజం చేస్తూ, ఈ స్టార్ జంట నిశ్చితార్థం చేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తన మాజీ భార్య సమంతతో విడాకుల తరువాత చైతూ, శోభితా ధూళిపాలతో ప్రేమలో పడ్డాడు. ఇక నాగచైతన్య, శోభిత పెళ్లి ముహూర్తం సహా ఎక్కడ చేసుకోబోతున్నారు? అనేది కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 8న చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లోని అక్కినేని నాగార్జున నివాసంలో ఇరువురి కుటుంబ సభ్యులు,

 సన్నిహితులు, స్నేహితుల మధ్య గ్రాండ్ గా జరిగింది. నాగ చైతన్యశోభిత డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఒక పర్ఫెక్ట్ ప్లేస్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో కాకుండా ఏదైనా బయట ప్రదేశంలోనే వీరి వివాహం జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. రాజస్థాన్‌, లేదా మధ్యప్రదేశ్ లాంటి చోట్ల రాయల్ స్టైల్ లో వీరి వెడ్డింగ్ చేసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడ కుదరని పక్షంలో విదేశాల్లో సైతం చేసుకునే ఆలోచన ఉన్నట్టుగా సన్నిహితుల నుంచి సమాచారం అందుతుంది. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే అక్కినేని నాగచైతన్య.. కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.

 చైతుకి ఆటో మైబైల్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కారు రేసింగ్స్ అన్నా, ఫార్ములా వన్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశారు. అలాగే ఆయన ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ కార్లను, మోటార్ సైకిల్స్‌ను కూడా సేకరిస్తుంటారు. అలాంటి ఇష్టమైన రంగంలోకి చైతన్య అడుగు పెట్టారు . ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్‌)లో పోటీ పడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని నాగ చైతన్య సొంతం చేసుకున్నారు. దీని వల్ల ఆయన ఐఆర్ఎఫ్‌ నిర్వహించే ఫార్ములా 4లో భాగమయ్యారు. దీనికి సంబంధించిన రేసులు ఆగస్ట్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: