పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన కల్కి 2898 ఎడి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఇందులో దీపికా పదుకొనే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ నటి నటులు ఇందులో ముఖ్య పాత్రలో నటించారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తాజాగా ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే కల్కి 2898 ఎడి సినిమా ఓటీటీలోకి రావడంతో తెలుగు సినీ ప్రేక్షకులు అంతా ఉత్సాహంగా ఆస్వాదిస్తున్నారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో నిలిచి భారీ

  అంచనాలను అందుకుంటోంది. మరి నిన్న అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం మరోసారి ఆడియెన్స్ తెగ ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా అప్పుడే ఓటీటీలో నెంబర్ 1 స్థానం లోకి ట్రెండింగ్ అవుతూ వచ్చేసింది. మరి ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాగా నిన్న స్ట్రీమింగ్ రావడంతోనే ఆల్ టైం టాప్ 5 నెంబర్ తో మొదలు కాగా ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్ లోకి వచ్చేసి అదరగొడుతుంది. ఇది కాసేపు పక్కన పెడితే భవిష్యత్తు నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమా, కాలయాత్ర, సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఆకట్టుకుంటుంది. విభిన్న కాలాలకు చెందిన వ్యక్తులు ఒకే కథలో ఎలా

 ముడిపడి ఉంటారు అనేది కథాంశం. కంప్యూటర్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు అని చెప్పవచ్చు. కాగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చాలా చర్చ జరుగుతోంది. చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాను అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, కథ, నటన అన్నీ చాలా బాగున్నాయని ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమందికి కథ కొంచెం క్లిష్టంగా అనిపించిందని అభిప్రాయపడుతున్నారు. కల్కి 2898 ఎడి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మైలురాయి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: