మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఇంద్ర మూవీ 2002 వ సంవత్సరం జూలై 22 వ తేదీన అత్యంత భారీ అంచనాల నడుమ ధియేటర్లలో విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసింది. ఇక ఈ సినిమా అప్పటివరకు ఏ సినిమా వసూలు చేయని కలక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇంత గొప్ప విజయం సాధించిన ఈ సినిమాను తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 22 వ తేదీన రీ రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ మూవీ రీ రిలీజ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. మరి ముఖ్యంగా ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా అమెరికాలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు రీ రిలీస్ లో బాగంగా అమెరికాలో రాని కలెక్షన్లు విడుదల అయిన మొదటి రోజు విషయంలో ఇంద్ర సినిమాకు వచ్చాయి.

ఇంద్ర సినిమాకి విడుదల అయిన మొదటి రోజు అమెరికాలో  59000 డాలర్ల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా అమెరికాలో రీ రిలీజ్ లో భాగంగా ఈ రేంజ్ కలెక్షన్లను వసూలు చేయలేదు. దానితో ఇంద్ర మూవీ రీ రిలీజ్ లో భాగంగా అమెరికాలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా ... వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: