రామ్ చరణ్ ఇటీవలే గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లు దాటింది ఈ సినిమా ప్రకటించి. ఈ సంవత్సరం లోపు ఎలాగైనా శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా మ్యూజిక్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందని సంగీత దర్శకుడు AR రహమాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లో మల్లయుద్ధం కథతో ఉంటుందని వార్తలు

 వస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలవుతుందని సమాచారం.  జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతోంది. మూవీలో క్యారెక్టర్ కి సంబందించిన లుక్ మేకోవర్ కోసం రామ్ చరణ్ వెయిట్ చేస్తున్నాడు.ఆ లుక్ రెడీ అవ్వగానే RC16 మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా పీరియాడికల్ జోనర్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఉంటుందనే ప్రచారం నడిచింది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం నడుస్తుందని గతంలో రివీల్ అయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా ఉత్తరాంధ్ర స్లాంగ్ లోనే

 మాట్లాడుతుందని టాక్ బయకొచ్చింది. కొంత ప్యాడింగ్ కోసం బుచ్చిబాబు ఉత్తరాంధ్ర నేపథ్యం ఉన్న కొత్త యాక్టర్స్ ని ఎంపిక చేశారు.  ఈ సినిమా కంప్లీట్ మాస్ కథాంశంతో ఉంటుందని అందరూ భావించారు. అయితే రామ్ చరణ్ సడెన్ గా ఈ మూవీ గురించి ఓ ఇంటరెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి క్లారిటీ ఇస్తూ కొత్త విషయాన్ని చెప్పారు. బుచ్చిబాబు సానాతో చేయబోతున్న సినిమా కామెడీ జోనర్ లో ఉంటుందని రామ్ చరణ్ చెప్పాడు. ఇప్పటి వరకు కామెడీ జోనర్ టచ్ చేయలేదు. అయితే ఫస్ట్ టైం బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తోన్న సినిమాలో కామెడీ టచ్ తో కథ ఉంటుందని రివీల్ చేశాడు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: