ఎస్ ఆర్ కల్యాణమండపం మూవీ తర్వాత హీరో కిరణ్ అబ్బవరం సినీ కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా కంటే ముందు రాజావారు రాణిగారు లో నటించాడు. అయితే, తన ఫస్ట్ మూవీ హీరోయిన్ రహస్య గోరఖ్ నే తన రియల్ లైఫ్ రాణిగా ఫిక్స్ అయ్యాడు.. ఆ మూవీ వల్లే వీరిద్దరి పరిచయం స్నేహంగా మారి ప్రేమ వరకు వెళ్ళింది. ఇలాగే వారు ఐదేళ్లు లవ్ చేసుకుని ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ మధ్యే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. వీరిద్దరి మీద మొన్నటి వరకు ఎన్నో వార్తలు వచ్చాయి.. ఎంగేజ్మెంట్ ఎప్పుడో చేసుకున్నారు.. కానీ పెళ్లి ఇంకా చేసుకోలేదంటూ చాలా మందికి సందేహం ఉంది. ఇప్పుడు వాటన్నింటికి

 చెక్ పెట్టారు. హీరో కిరణ్ అబ్బవరం , తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి గురువారం (ఆగస్ట్ 22న) ఘనంగా జరిగింది. కర్ణాటకలోని కూర్గ్ లోని ఓ ప్రవేట్ రిసార్ట్స్ లో వీరి మ్యారేజ్ జరిగినట్లు సమాచారం. రాజావారు రాణిగారు షూటింగ్‌లోనే వీరిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం. దాదాపు ఐదేళ్ల పాటు రహస్య ప్రేమాయణం సాగించిన ఈ జంట పెళ్లితో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే..రాజావారు

 రాణిగారు సినిమా తర్వాత రహస్య గోరఖ్ సినిమాల్లో నటించలేదు.చాలా ఏళ్ళ నుండి సినిమాలకు దూరంగానే ఉంటున్నారు ఆమె. ఇక కిరణ్ అబ్బవరం మాత్రం హిట్స్,ఫ్లాప్స్ తో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాతో కెరీర్ లో మొదటి బ్రేక అందుకున్న ఈ హీరో..చాలా కాలం తరువాత వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ బాట పట్టాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: