మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ దగ్గర బాక్స్ ఆఫీస్ పోరు గట్టిగానే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకు అంటే ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందబోయే విశ్వంబర మూవీ తో పాటు వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను కూడా విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

మూవీ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఇదే కానీ జరిగితే ఒక సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే చిరుకు విశ్వంభర ద్వారా హిట్ కష్టమే అని తెలుస్తుంది.

అది ఏమిటి అనుకుంటున్నారా. 2001.వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు మూవీ తో పాటు బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు , వెంకటేష్ హీరోగా రూపొందిన దేవిపుత్రుడు సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో మృగరాజు సినిమా ప్రేక్షకులను ఘోరంగా నిరుత్సాహపరచగా , దేవిపుత్రుడు మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరి 2001 సెంటిమెంట్ రిపీట్ అవుతే విశ్వంబర మూవీ ద్వారా చిరంజీవి కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎదురు దెబ్బ తగిలి అవకాశం ఉంది. మరి చిరంజీవి 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగకు జరిగిన పరిణామాన్ని పునరావృతం కాకుండా విశ్వంబర మూవీతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: