హనుమాన్’ మూవీతో యంగ్ హీరో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకుపైగా రాబట్టింది. అంతకు ముందు వచ్చిన ఓ బేబీ, జాంబీ రెడ్డిలతో మంచి పేరు తెచ్చుకున్న తేజ.. హనుమాన్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. అందరి చూపు అతడు నటించబోయే నెక్ట్స్ మూవీపై పడింది. ప్రస్తుతం తేజ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించే యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీ ‘మిరాయ్’లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది.దీంతో తనకు వచ్చిన క్రేజ్‌ను కాపాడుకోవాలని జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈసారి సూపర్ యోధగా అలరించనున్నాడు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిరాయ్‌’. నేడు తేజ పుట్టినరోజు సందర్భంగా నిర్మాణ సంస్థ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది.ఇందులో స‌జ్జ పై నుంచి కింద‌ప‌డిపోతుండ‌గా కింద ఉన్న బిల్డింగ్‌లు కూలిపోతున్నాయి. ఏదో మంత్రించిన క‌ర్ర లాంటి వ‌స్తువు ఆయ‌న ప‌ట్టుకున్న‌ట్లుగా ఉంది. మొత్తానికి ఫ‌స్ట్ లుక్ ఆక‌ట్టుకుంది.

పోస్టర్ లో తేజ సజ్జా మండుతున్న ఇనుప రాడ్‌ను పట్టుకుని తనను తాను పడిపోకుండా కాపాడుకోవడం, వస్తువులు పైనుండి పడటాన్ని చూపిస్తూ, ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకుపోయినప్పటికీ దైర్యంగా పోరాడుతున్న హీరోఇజాన్ని చూపించాడ. వెనుక ఒక పురాతన దేవాలయాన్ని కూడా చూపించాడు దర్శకుడు. ఈ పోస్టర్ లో చూపించిన యాక్షన్ ఘట్టాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. అత్యున్నత స్థాయి నిర్మాణ ప్రమాణాలతో ఎక్కడ కాంప్రమైస్ కాకుండా భారీ బడ్జెట్ లో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమా సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం నుండి గతంలో రిలీజ్ చేసిన తేజ సజ్జ మరియు మంచు మనోజ్ పాత్రలను పరిచయం చేసే ఫస్ట్-లుక్ పోస్టర్లు మరియు గ్లింప్‌లు అద్భుతమైన స్పందననురాబట్టడమే కాకుండా ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఈ కొత్త పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. మిరాయ్‌ని 8 భాషల్లో ఏప్రిల్ 18, 2025న వేసవిలో 2డి మరియు 3డి వెర్షన్‌లలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.ఇప్పుడు ఈ న్యూ పోస్టర్ సినిమా పట్ల మరింత ఆసక్తిని కలిగిస్తుంది. కార్తీక్ గట్టమనేని డైరెక్టర్ గానే కాకుండా సినిమాటోగ్రఫీ తోపాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు. డైలాగ్స్ మణిబాబు కరణం అందించారు. గౌర హరి సంగీతాన్ని అందిస్తుండగా, ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర తంగాల ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: